మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 238.41 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,470.11 వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,187.70 వద్ద నిలిచాయి.
ఆస్థా స్పిన్‌టెక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్, కేసీపీ షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్, విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, ఏకేజీ ఎగ్జిమ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


