అపోలో హాస్పిటల్స్‌, ఇప్లేన్‌ ఎంవోయూ | Apollo Hospitals ePlane MoU Electric Air Ambulances Medical Drones India | Sakshi
Sakshi News home page

అపోలో హాస్పిటల్స్‌, ఇప్లేన్‌ ఎంవోయూ

Jul 24 2026 1:11 PM | Updated on Jul 24 2026 1:16 PM

Apollo Hospitals ePlane MoU Electric Air Ambulances Medical Drones India

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రమాదాల్లో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి చేర్చి, కీలక సమయంలో చికిత్స అందేందుకు తోడ్పడేలా యూబిఫ్లై టెక్నాలజీస్‌ (ఇప్లేన్‌ కంపెనీ), అపోలో హాస్పిటల్స్‌ చేతులు కలిపాయి. ఎమర్జెన్సీ హెల్త్‌ కేర్‌ వ్యవస్థలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లు, మెడికల్‌ డెలివరీ డ్రోన్లను వినియోగించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దీనితో పేషంట్లను వేగవంతంగా ఆస్పత్రికి చేర్చేందుకు ఇప్లేన్‌కి చెందిన ఈ200ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లు, అపోలోకి చెందిన 1066 అంబులెన్స్‌లు..ఆస్పత్రులతో పాటు ఔషధాలు.. ఉత్పత్తులను నిమిషాల్లో సరఫరా చేసే మెడికల్‌ డెలివరీ డ్రోన్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా కీలక సమయంలో నాణ్యమైన వైద్యం అందగలదని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు. ఈ భాగస్వామ్యం కింద ఈ200ఎక్స్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లు, మెడికల్‌ డెలివరీ డ్రోన్ల కోసం అపోలో ఆర్డర్లు ఇవ్వడానికి, అలాగే ఇప్లేన్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement