కీవ్:ఉక్రెయిన్ రష్యా యుద్ధం మెుదలై దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్నా ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా (సోమవారం) మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడులలో 11మంది ఉక్రెయిన్ పౌరులు దుర్మరణం చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కీవ్ టార్గెట్‌గా 68 మిసైళ్లు, 361 పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు రాయిటర్స్ కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడులలో కీవ్‌లో దాదాపుగా 10 మందికి పైగా నగరంలో మృతి చెందగా మరో 45 మంది గాయపడినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది టర్కీలో నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
కాగా ఇటీవలే కీవ్‌పై రష్యా దాడులతో విరుచుకపడుతోంది. గత గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఏకధాటిగా 11 గంటల పాటు జరిగాయి. ఈ అటాక్స్‌లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇటీవల తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఈ దాడులు ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్‌వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గింది.
దాడులు ఎందుకు తీవ్రతరమయ్యాయి
ఉక్రెయిన్ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. దీనికి ప్రతికారంగా రష్యా, కీవ్‌పై దాడులు చేస్తోంది.


