Usman Khawaja: ఐదేళ్ల వయసులో జాతి వివక్ష.. కట్‌చేస్తే స్టార్ క్రికెటర్ హోదా

ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా మాత్రమే చాలా మందికి పరిచయం. కానీ ఖవాజా క్రికెటర్‌గా మాత్రమే గాక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో కొనసాగుతున్న నల్లజాతీయ క్రికెటర్ అతను. ఖవాజా ఐదేళ్ల వయసులో అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఖవాజా తండ్రి కర్రీ మేకర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. తన ఐదేళ్ల వయసులో ఖవాజా .. 'Fuking Curry Maker Son' అంటూ జాతి వివక్షకు గురయ్యాడు. అలా జాతి వివక్షను తొలిసారిగా ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు.
ఖవాజా ఒక క్రికెటర్‌గా రాణిస్తూనే నల్లజాతీయులపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా నిలబడి తన పోరాటాన్ని కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఖవాజా పౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపించి మైనారిటీలకు, వలసదారులకు, శరణార్థులకు, మానసికంగా కుంగిపోయిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాడు. అలా కర్రీ మేకర్ కొడుకు ఇవాళ స్టార్ క్రికెటర్ హోదా సంపాదించాడు. వ్యక్తిగతంగాను నలుగురికి సహాయపడే పనులు చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నాడు.
ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్‌గా రాణిస్తున్న ఉస్మాన్ ఖవాజా టీమిండియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జట్టుకు కీలకం కానున్నాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఖవాజా గతేడాది నుంచి టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియన్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
అయితే వీసా సమస్య కారణంగా జట్టుతో పాటు రాలేకపోయిన ఖవాజా ఒకరోజు ఆలస్యంగా భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. వచ్చీ రాగానే ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాడు. పశ్చిమాసియా మూలాలున్న క్రికెటర్ కావడంతో ఖవాజా స్పిన్‌ను సమర్థంగా ఆడగలడు. ఇదే అతన్ని ఈ టెస్టు సిరీస్‌కు ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై ఖవాజా లాంటి బ్యాటర్ సేవలు చాలా అవసరం.
ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించాయి.ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.
The two facets of the Usman Khawaja Foundation:
1: Allowing kids from low socio-economic backgrounds to play sport for free
2: Giving grants, scholarships and things needed for kids' educationBoth close to Khawaja's ❤️ pic.twitter.com/REQ6CzAQcP
— 7Cricket (@7Cricket) January 30, 2023
చదవండి: భారత్‌తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్!
భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు