IND vs AUS: భారత్‌తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరగనున్న తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కాలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. అయితే భారత్‌తో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ఆస్ట్రేలియా సెలక్టర్లు భావించారు.
ఈ క్రమంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించనట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టుతో పాటు హాజిల్‌వుడ్ భారత్‌కు వచ్చినప్పటికి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది.
హాజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్
ఇక గాయపడిన హాజిల్‌వుడ్ స్థానంలో పేసర్ స్కాట్ బోలాండ్‌కు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. కాగా బోలాండ్ టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా బోలాండ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఇప్పటివరకు 6 టెస్టులు ఆడిన హాజిల్‌వుడ్ 28 వికెట్లు సాధించాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్ యాదవ్, పుల్కిత్
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు