IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్‌ యాదవ్‌, పుల్కిత్

BGT 2023: Jayant Yadav and Pulkit Narang added as net bowlers  - Sakshi

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం ఇప్పటికే నలుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. తాజాగా మరో ఇద్దరి స్పిన్నర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. వారిలో భారత వెటరన్‌ స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌,  ఢిల్లీకి చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ పుల్కిత్ నారంగ్ ఉన్నారు.

అంతకుముందు సెలక్టర్లు  ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌, రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌, టీమిండియా బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, తమిళనాడు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌, సాయి కిషోర్‌ను నెట్‌ బౌలర్లగా చేశారు.

తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా
బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ సెషన్స్‌లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఆసీస్‌ సాధన చేస్తుండగా.. భారత జట్టు నాగ్‌పూర్‌లోని ఓల్డ్‌ విదర్భ క్రికెట్‌ ఆసోషియషన్‌ గ్రౌండ్‌లో చెమటడ్చుతోంది.

కాగా ఇరు జట్లు కూడా ముఖ్యంగా స్పిన్నర్లపైనే ఎక్కువగా దృస్టిసారించాయి. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలి ఉన్న బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాతో కమ్మిన్స్‌ సేన  ప్రాక్టీస్‌ చేస్తుంది. అదే విధంగా ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి భారత్‌ కూడా తమ వ్యూహాలను రచిస్తోంది.

ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్‌: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టుల సిరీస్‌
► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
► మార్చి 1-5: ధర్మశాల
► మార్చి 9- 13: అహ్మదాబాద్‌

మూడు వన్డేల సిరీస్‌
► మార్చి 17- ముంబై
► మార్చి 19- వైజాగ్‌
► మార్చి 22- చెన్నై 

చదవండి: IND vs AUS: శుబ్‌మన్‌ గిల్‌ వద్దు.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో అతడే సరైనోడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top