మొబైల్ చార్జర్‌ను కరెంట్ ప్లగ్‌లకే వేలాడేసి ఉంచడం.. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో కనిపించేదే. కొందరైతే స్విచ్ ఆన్‌లో ఉండగానే వాటిని అలా వదిలేస్తుంటారు. ఉరుకుల, పరుగుల జీవితమే అందుకు కారణమని సాకులు చెబుతుంటారు. అయితే ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయమేమీ కాదని అంటున్నారు నిపుణులు.
సెల్‌ఫోన్ చార్జర్లను ఇలా కరెంట్ ఫ్లగులకు వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెంగా విద్యుత్ వినియోగం.. భారీ పరిమాణంలోనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే..
👉ఫాంటమ్ పవర్ వినియోగం (Phantom Power): చార్జర్‌కి ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చిన్న మొత్తంలో విద్యుత్ (0.1–0.5 వాట్) వినియోగం జరుగుతుంది. దీన్ని ‘వాంపైర్ ఎనర్జీ’ అంటారు. దీన్ని ఇలాగే లెక్కస్తే రోజులు.. నెలలు.. సంవత్సరాలకు కొన్ని యూనిట్లు వృథా అవుతాయన్నమాట.
👉చార్జర్ లైఫ్ తగ్గే అవకాశం.. నిరంతరం విద్యుత్ ప్రవాహంలో ఉండటం వల్ల చార్జర్‌లోని అంతర్గత భాగాలు మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలికంగా పనితీరు తగ్గుతుంది.
👉ఇలా స్విచ్ బోర్డులకు, ఫ్లగ్గులకు చార్జర్లు వదిలేయడం సేఫ్ కూడా కాదు. కొన్నిసార్లు విద్యుత్‌తో అవి వేడెక్కే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాణ్యత లేని చార్జర్లతో. దీనివల్ల ఫోన్లు పాడైపోవడం, పేలిపోవడం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు.
👉పర్యావరణంపై ప్రభావం.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలవాటు ఎంత మందికి ఉందో?. అంటే.. చాలా విద్యుత్ వృథా అవుతుందన్నమాట. కాబట్టి విద్యుత్ వినియోగం అనేది చిన్న మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా.. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు.
పాటించాల్సినవి..
తడి చేతులతో చార్జర్లను ఫోన్‌కు కనెక్ట్ చేయకూడదు
ఫోన్ చార్జింగ్‌లో లేనప్పుడు చార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేయడం ఉత్తమం
నాణ్యమైన చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా వేడి, విద్యుత్ వృథా వంటి సమస్యలు తగ్గుతాయి.
మార్కెట్‌లలోకి రకరకాల చార్జర్‌లు(ఒరిజినల్ వెర్షన్) వస్తున్నాయి. స్మార్ట్ ప్లగ్‌లు వాడితే, ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ చేయవచ్చు
:::సాక్షి, వెబ్‌డెస్క్
ఇదీ చదవండి: పవర్ ఆఫ్‌లో ఉన్నా మీ ఇంట్లో ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా?


