ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు అఫ్గాన్ బౌలర్ల దాటికి 41.2 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది.
ఓ దశలో బంగ్లాదేశ్ వంద పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపించింది. ఈ సమయంలో పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ (70 పరుగులు) ఒంటరి పోరాటం చేయగా.. సైఫ్ హసన్ (41 పరుగులు) కొంతసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరైనా సాధించగలిగింది.
అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, యామిన్ అహ్మద్‌జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.


