New York: ‘గర్బా’ నృత్యంలో మమ్దానీ జోష్‌! | New York Mayor Zohran Mamdani Joins Navratri Celebrations, Performs Traditional Gujarati Garba Dance, Watch Video Inside | Sakshi
Sakshi News home page

New York: ‘గర్బా’ నృత్యంలో మమ్దానీ జోష్‌!

Oct 21 2026 12:17 PM | Updated on Oct 21 2026 12:37 PM

Mamdani does Garba with Indian Community

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన నవరాత్రి వేడుకల్లో మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ అక్కడి భారతీయులతో కలిసి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆయన సాంప్రదాయ గుజరాతీ గర్బా నృత్యం చేశారు. ఆయన నలుపు రంగు సూట్‌ ధరించి నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంబరాల అనంతరం ఆయన స్థానిక దేవాలయాన్ని సందర్శించి, అక్కడ పూజారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
 

ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా హిందువులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణాసియా వ్యాప్తంగా దుర్గాపూజ, దసరా, నవరాత్రి వంటి వివిధ పేర్లతో జరుపుకునే పండుగల ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ... నవరాత్రి వేళ హిందువులు అమ్మవారిని పూజిస్తారని, గర్బా ఆడతారని, ఇళ్లలో బొమ్మల కొలువు పెడతారని ఆయన దానిలో రాశారు. ఈ పండుగ అందరి జీవితాల్లోనూ సరికొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
 

మమ్దానీ గతంలో కూడా దీపావళి, రక్షాబంధన్  వేడుకల్లో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్, ఉగాండాకు చెందిన విద్యావేత్త మహమూద్ మమ్దానీల కుమారుడైన ఆయన... ముస్లిం, హిందూ సంప్రదాయాల కలయిక మధ్య పెరగడమే తన వ్యక్తిత్వాన్ని, విలువలను తీర్చిదిద్దిందని మమ్దానీ గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: ‘టాప్‌ యంగ్ సైంటిస్ట్’: భారత బాలికకు రూ. 21 లక్షల బహుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement