మేయర్‌ ప్రమాణ స్వీకారానికీ డుమ్మా! | Internal Clashes Between Vijayawada Kutami Leaders | Sakshi
Sakshi News home page

మేయర్‌ ప్రమాణ స్వీకారానికీ డుమ్మా!

Nov 28 2026 7:47 AM | Updated on Nov 28 2026 7:47 AM

 Internal Clashes Between Vijayawada Kutami Leaders

మేయర్‌ రాధాకృష్ణ బాధ్యతల స్వీకారానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)

పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమం కూటమి రాజకీయాల్లో విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ఇటీవల జరిగిన మేయర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి తాజాగా శుక్రవారం బాధ్యతల స్వీకారానికీ హాజరుకాకపోవడం గమనార్హం. ఒకవైపు ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఈ కార్యక్రమానికి హాజరై దగ్గరుండి పర్యవేక్షించారు. 

మేయర్‌ ప్రమాణ స్వీకారం నుంచి బాధ్యతల స్వీకరణ వరకు ఎంపీ కేశినేని చిన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే నగరానికి చెందిన కీలక ప్రజాప్రతినిధులైన బోండా ఉమా, సుజనా చౌదరి మాత్రం ఈ రెండు కార్యక్రమాలకూ దూరంగా ఉండటం గమనార్హం. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వంగవీటి రాధాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆయన ఛాంబర్‌లో కలుసుకుని అభినందించారు. దీంతో ఒకే కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య కార్యక్రమాల పట్ల కనిపించిన భిన్న వైఖరి రాజకీయ చర్చలకు ఆజ్యం పోసింది. 

ఎంపీ కేశినేని చిన్నితో నెలకొన్న విభేదాల కారణంగానే మేయర్‌ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోండా ఉమా హాజరుకాలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పశి్చమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం నగర ప్రథమ పౌరుడి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. వ్యక్తిగత కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూటమి వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నట్లు సమాచారం. 

కూటమిలో సమన్వయంపై చర్చలు 
మేయర్‌ ఎంపిక సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేల గైర్హాజరు, తాజాగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ అదే పరిస్థితి పునరావృతం కావడం విజయవాడ కూటమి రాజకీయాల్లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంపీ హాజరు, ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరు, మరో ఎమ్మెల్యే చాంబర్‌కు వెళ్లి మేయర్‌ను కలవడం       వంటి పరిణామాలు నగర ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. కొత్త మేయర్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కూటమి ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో ముందుకు సాగుతారా? లేక అంతర్గత రాజకీయ దూరాలు కొనసాగుతాయా? అన్నది విజ యవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement