నోటిఫై చేసిన ఆర్‌బీఐ
సాక్షి, అమరావతి: అప్పుల పరంపరను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.2,000 కోట్లు బడ్జెట్ అప్పు(ప్రభుత్వం తన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ లోటును పూడ్చుకోవడానికి తీసుకునే రుణం) చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.


