‘ధురంధర్’పై శశి థరూర్ సంచలన విశ్లేషణ | Shashi Tharoor Reviews Dhurandhar | Sakshi
Sakshi News home page

‘ధురంధర్’పై శశి థరూర్ సంచలన విశ్లేషణ

Oct 21 2026 1:56 PM | Updated on Oct 21 2026 2:14 PM

Shashi Tharoor Reviews Dhurandhar

తిరువనంతపురం: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. దాదాపు ఎనిమిది గంటల నిడివితో కూడిన ఈ రెండు భాగాలను చూసిన ఆయన, ఇది అత్యంత భారీ స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందించిందని కొనియాడారు. ముఖ్యంగా మొదటి భాగం కంటే రెండో భాగమైన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

అయితే, చిత్రంలోని హింసను చూపించిన తీరుపై థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కథా గమనానికి అవసరమైన దానికంటే ఎక్కువగా రక్తపాతం, క్రూరత్వం, అసహ్యకరమైన దృశ్యాలను మితిమీరి చూపించారని ఆయన విమర్శించారు. ఈ స్థాయి బీభత్సం, హింస చూపించకుండానే కథను ప్రభావవంతంగా చెప్పే అవకాశం ఉందని, ఈ గ్రాఫిక్ హింస భారతీయ సినిమాలో హద్దులు దాటినట్లుగా అనిపించిందని వ్యాఖ్యానించారు.

దీనితో పాటు చిత్రంలోని రాజకీయ కోణాలు, ప్రచార ధోరణి అంశాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలను చిత్రీకరించిన విధానం ప్రజల్లో విద్వేష భావాలను పెంచే ప్రమాదం ఉందని, అందుకే పాకిస్తాన్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలలో ఈ సినిమాను నిషేధించారన్న వార్తలను ప్రస్తావించారు. తెరపై చూపిన ఉద్రిక్తతలు వాస్తవ ప్రపంచంలో రెండు దేశాల ప్రజల మధ్య చెడు భావాలను పెంచవచ్చని అన్నారు.

మరోవైపు, ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలను చూపించిన విధానంపై కూడా థరూర్ సందేహాలు లేవనెత్తారు. నిఘా విభాగం అధికారులతో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయాల ప్రకారం వారి పని ప్రధానంగా సమాచార విశ్లేషణ, అంతర్గత చర్చలకే పరిమితమై ఉంటుందని, సినిమాలో చూపించినట్లుగా విదేశాల్లో బాంబు పేలుళ్లు, హై-రిస్క్ యాక్షన్ ఆపరేషన్లు నిజ జీవితంలో జరగవని చెప్పారు. అలాగే అజిత్ దోవల్ ఆధారంగా ఆర్. మాధవన్ పోషించిన 'అజయ్ సన్యాల్' పాత్ర సుదీర్ఘ కాలం పాటు ఒకే పదవిలో కొనసాగడం వాస్తవ విరుద్ధమని, అందుకే దీన్ని కల్పిత చిత్రంగానే చూడాలంటూ ముగించారు.

ఇదీ చదవండి: New York: ‘గర్బా’ నృత్యంలో మమ్దానీ జోష్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement