కాలాన్ని గెలిచిన నవ్వు..117 ఏళ్ల బామ్మ లైఫ్‌స్టైల్‌ సీక్రెట్‌..! | At 117, Albanian Woman Who Witnessed World War II May Be the World’s Oldest Living Person, Reveals Secrets To A Long And Happy Life | Sakshi
Sakshi News home page

కాలాన్ని గెలిచిన నవ్వు..117 ఏళ్ల బామ్మ లైఫ్‌స్టైల్‌ సీక్రెట్‌..!

Oct 21 2026 11:07 AM | Updated on Oct 21 2026 11:24 AM

At 117 Albanian May Be Worlds Oldest Woman

జీవితం అంటే సుఖ దఃఖాల కలయిక. కళ్లు తడవకుండా లైఫ్‌ని లీడ్‌ చేయడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒత్తిడి, డిప్రెషన్‌ బారిన పడి అనారోగ్యం పాలవ్వడం సహజం. కానీ ఈ బామ్మ కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో వసంతాలను చూసింది. ప్రపంచ యుద్ధం నుంచి టెక్నాలజీతో దూసుకుపోతున్న యుగం వరకు ప్రతిదాన్ని వీక్షించింది. కాలంతోపాటు గెలిచింది. లైప్‌ ఈజీ్‌ బ్యూటిఫుల్‌ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ వండర్‌ బామ్మ. 

ఆ మహిళే అల్బేనియాకి చెందిన ఖమీలే మర్రా. ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ. ఒట్టోమిన్‌ పాలనలో జన్మించి రెండో ప్రపంచ యుద్దాన్ని కళ్లారా చూసిందామె. సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం ముగియడానికి పక్షం రోజుల ముందే 36 ఏళ్ల నిండాయి ఆమెకు. జీవితం అనేది అత్యంత ఎత్తైన శిఖరాల మధ్య దర్పంగా పూచే టోమోర్‌ పువ్వులా అందమైనదని అంటోంది మర్రా. 

పండ్ల చెట్లతో చుట్టబడి ఉన్న ఆ గ్రామంలో మర్రా తన జీవితంలో దాదాపు పూర్తి కాలం తనే స్వయంగా ఆహారాన్ని పండించుకుంటూ, పశువులను మేపుకుంటూ గడిపిందామె. సాంప్రదాయ తెల్లటి తలపాగాతో కప్పబడి, ముడతలు పడిన ముఖంతో చిరునవ్వులు చిందిస్తుంటుంది ఈ బామ్మ. దేవుడు నిర్ణయించినంత కాలం హాయిగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని అంటోందామె. అంతేగాదు ప్రపంచంలో అత్యంత వృద్ధరాలిగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది కూడా. 

ఇంతవరకు సెంటెరియన్ల అనగానే సరైన రికార్డుల, ఆధారాలు లేవని, భారీ పెన్షన్‌ మోసాలు ఉన్న రికార్డులేనని గిన్నిస్‌ రికార్డు సంస్థ పేర్కొంది. కానీ మర్రా అలా కాదని, ఆమె వద్ద సరైన ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. ఆమె బంధవులు గిన్నిస్‌ రికార్డుని సందర్శించగా..1945లో జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం, 1919లో జారీ చేయబడిన పాస్‌పో, ఇటీవల గుర్తింపు కార్డుల్లో సైతం ఒకే పుట్టిన తేదీ ఉంది. ఆమె వయసు స్థానిక అధికారులను సైతం ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే ఆమెకు వందేళ్ల సమీపిండచానికి ముందే పింఛన్‌ ఆపేశారు. 

మళ్లీ ఆమె 80 ఏ‍ళ్ల కుమారుడు స్థానిక అధికారులను సంప్రదించి, సాక్షుల వాంగ్మూలాలతో సహా రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్లు మా అమ్మ ఇంకా బతికే ఉందన్న విషయాన్ని వాళ్లు అస్సలు నమ్మలేదని చెబుతున్నాడు ఆమె కుమారుడు. ఈ నెల ప్రారంభంలోనే ఆమె వయసు పురస్కరించుకుని ప్రభుత్వం ఆమెకు ఒక ప్రత్యేక ప్రభుత్వ పింఛను జారీ చేసింది. 

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..
మర్రా అలవాట్లు, మంచి జీవనశైలి తదితరాలే ఆమె అసాధారణ దీర్ఘాయువుకి కారణమై ఉండొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆమె ఉదయాన్నే లేచి పెరటిని ఊడ్చి, తన పూల మొక్కలకు ఆమెనే స్వయంగా నీరు పోసి, కోళ్లకు మేత వేసి, ఆ తర్వాత కాఫీతో సేద తీరుతుందామె. 

ఆమె తనతోపాటు ఉండే కుమారుడితో కలిసి తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పండ్ల తోట వరకు నడకను ఆస్వాదిస్తుంది. దారిలో పండిన దానిమ్మపండ్లను కలెక్ట్‌ చేసుకుంటూ అక్కడి ప్రకృతిలో సేదతీరుతుంది. తులసీ ఆకులను కూడా జేబులో పెట్టుకుంటుందట  ఆమె. ఆమె ఇప్పటి వరకు డాక్టర్‌ని సంప్రదించలేదని, కనీసం మందులు కూడా తీసుకోలేదని చెబుతున్నారు. మర్రా భర్త 36 ఏళ్ల క్రితం చనిపోయారు. 

తమ దాంపత్యం గురించి అడగగా మర్రా పెదవులపై చిరునవ్వు వెల్లివిరిచింది. మా మధ్య ఎంత ప్రేమ ఉంది అనడానికి మాకు పుట్టిన ఏడుగురు పిల్లలే నిదర్శనమని అంటోందామె. తన కుటుంబంలో ఐదు తరాలు తన కళ్లముందే పెరగడాన్ని చూశానంటోంది. తాను కోల్పోయిన కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తు చేసుకున్నప్పుడూ కళ్లల్లో నీళ్లు తిరగాయ్‌ ఆమెకు. 

మేనకోడలు నుంచి ఫోన్‌ రాగానే ఆమె ముఖం వెలిగిపోయింది. తన మనవళ్లు, ముని మనవరాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం, సొంతింటిని నిర్మించుకోవడం తదితరాలన్నీ చూశానని చెబుతోంది. తనకు ఇంట్లో పిల్లలంతా సందడిగా తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఆమె వద్ద తన టీనేజ్‌ టైంలో దిగిన ఒకే ఒక్క ఫోటో ఉంది. 

అది చూస్తే ఈ బామ్మనే..ఆ వయసులో ఇంత అందంగా ఉండేదా అని ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడామె వయసు 18 ఏళ్లు అని చెబుతోంది మర్రా. ఆమెను చూస్తే..జీవితంలో కష్టాలనేవి కామన్‌..వాటిని దాటుకుంటూ ఎలా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావ్‌ అన్న దానిపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెబుతోంది కదా ఈ బామ్మ జీవనశైలి.

ఇదీ చదవండి: వెల్నెస్‌ కోచ్‌గా డెంటిస్ట్‌..! కట్‌చేస్తే ఇవాళ ఏకంగా..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement