7 రోజుల తరువాత సీజేపీ నాయకులకు భారీ ఊరట | SEM court orders release of CJP leaders Saurav Ashutosh from judicial custody | Sakshi
Sakshi News home page

7 రోజుల తరువాత సీజేపీ నాయకులకు భారీ ఊరట

Oct 21 2026 6:48 PM | Updated on Oct 21 2026 7:03 PM

SEM court orders release of CJP leaders Saurav Ashutosh from judicial custody

సాక్షి, న్యూఢిల్లీ:  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్  (Saurav Das)  , అశుతోష్ రాంకా (Ashutosh Ranka)కు భారీ ఊరట  లభించింది.  ఏడు రోజుల పాటు జైల్లో గడిపిన ఇరువురికీ  జ్యుడిషియల్ రిమాండ్‌పై ఒక ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (SEM) విడుదల చేయాలని  బుధవారం  ఆదేశించారు. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించి, జాతీయ జెండాలను ఎగురవేశారన్న ఆరోపణలతో   సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా  అక్టోబర్ 14 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 

శాంతి ఒప్పందాలను ఉల్లంఘించి, తాళం వేసిన గేటును దాటి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారనే ఆరోపణలపై అక్టోబర్ 13న దాస్, రాంకాలను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ ప్రదేశాన్ని నియమిత నిరసన ప్రదేశంగా ప్రకటించారు.వారిద్దరినీ తొలుత అక్టోబర్ 14న ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అక్టోబర్ 19న వారి కస్టడీని మరో రెండు రోజులు పొడిగించగా, అది బుధవారంతో ముగియాల్సి ఉంది.వారిద్దరినీ SEM ఎదుట హాజరుపరచగా, విచారణ సమయంలో వారి పూచీకత్తు పత్రాలను కూడా  సమర్పించారు. అయితే వారి జైలు కస్టడీని మూడు రోజులు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.  వీరి జ్యుడిషియల్ కస్టడీ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎస్ఈఎం (SEM) ముందు జరగనున్న విచారణ ఫలితం కోసం వేచి ఉండాలని, వారి ఫిర్యాదు కొనసాగితే అప్పీలేట్ కోర్టును ఆశ్రయించాలని వారిని కోరింది.

ఇదీ చదవండి: మాజీ భర్తను, అతని ప్రియరాల్ని హత్య చేసిన 76 ఏళ్ల మహిళ



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement