అమెరికాలో 76 ఏళ్ల వృద్ధురాలు తన మాజీ భర్తను, అతని 40 ఏళ్ల ప్రేయసిని కాల్చి చంపింది. జార్జియాలోని ఉవాల్డాలోని మెక్‌నాట్ ఫాల్స్ రోడ్డులో ఉన్న ఒక ట్రైలర్ హోమ్‌లోకి ప్రవేశించిన గ్రేస్ ఎడ్జ్, ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వారిద్దరూ బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించారు. పదేళ్ల క్రితమే తన భర్తతో విడిపోయినప్పటికీ, వారిద్దరి సంబంధం ఇష్టం లేకపోవడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఉవాల్డాలోని మెక్‌నాట్ ఫాల్స్ రోడ్డులో ఉన్న ట్రైలర్ హోమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. టూంబ్స్ కౌంటీకి చెందిన గ్రేస్ ఎడ్జ్ (76) అనే మహిళ తన మాజీ భర్త ఇంట్లోకి హఠాత్తుగా ప్రవేశించి మరీ విచక్షణారహితంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆమె మాజీ భర్త వాలెస్ ట్రూమాన్ ఎడ్జ్ (75), ఆయన ప్రియురాలు పమేలా కుక్ (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ దాడిలో ఆ గ్రేస్‌చేతికి కూడా గాయమైంది.
కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న పమేలా కుక్ తల్లి డయాన్ కుక్ 911కి ఫోన్ చేసి అత్యవసర సమాచారం అందించారు. ఎలాంటి గొడవ లేదా వాగ్వాదం జరగకుండానే గ్రేస్ ఎడ్జ్ ఇంట్లోకి వచ్చి నేరుగా కాల్పులు ప్రారంభించిందని డయాన్ తెలిపారు.
ఇదీ చదవండి: షాకింగ్ : ముంబైలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం
కారణాలు
పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. గ్రేస్ ఎడ్జ్, వాలెస్ ఎడ్జ్ దంపతులు దశాబ్ద కాలం క్రితమే విడాకులు తీసుకున్నప్పటికీ, వారి మధ్య సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే, తన కంటే 35 ఏళ్లు చిన్నదైన పమేలా కుక్‌తో వాలెస్ డేటింగ్ ప్రారంభించడంతో గ్రేస్ తీవ్ర అసంతృప్తికి లోనైంది. గతంలో కూడా గృహ హింస, వివాదాల విషయమై వీరిద్దరూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని, అయితే అప్పట్లో ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
లొంగిపోయిన గ్రేస్
కాల్పులఘటన అనంతరం గ్రేస్ ఎడ్జ్ నేరుగా షెరీఫ్ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయింది. గ్గ్రేసుపై ఏడు అభియోగాలు నమోదై నాయి. వాటిలో రెండు దురుద్దేశపూర్వక హత్య కేసులు, రెండు హత్య కేసులు, మూడు తీవ్రమైన దాడి కేసులున్నాయి ప్రస్తుతం ఆమెను టూంబ్స్ కౌంటీ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.
ఇదీ చదవండి: కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి


