పొద్దుపొద్దునే కప్పు కాఫీ కడుపులో పడితే గానీ బండి నడవదు. ఇలా ఉదయం పూట కాఫీ తాగితే అది మనల్ని యాక్టివ్ చేయడమే గాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నాడు కేన్సర్ వైద్యుడు. తాను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతానని చెప్పారు కూడా. చాలా అధ్యయనలు కాఫీ దీర్ఘాయువులో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించాయని పేర్కొన్నారు. కానీ మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందాంటే ఎలా తాగాలో, ఏవిధంగా ఎప్పటికీ తాగకూడదు సవివరంగా వెల్లడించారు.
కాఫీ ఎందుకు తాగాలంటే..
క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి కాలేయాన్ని రక్షిస్తుంది.
కాఫీలో శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8% తగ్గుతుంది, 2 కప్పులు తాగితే 15%
కాఫీ తాగే మహిళలకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను డీఎన్‌ఏ నుంచి రక్షిస్తాయి. కాఫీ ఈస్ట్రోజెన్ జీవక్రియ జరిగే విధానాన్ని మారుస్తుంది, తద్వారా రక్తప్రవాహంలో ప్రసరించే ఫ్రీ ఈస్ట్రోజెన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది
కాఫీలోని ఇతర సమ్మేళనాలు పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తాయట. కెఫీన్‌కు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయట. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 37% తగ్గుతుందంటున్నుఆరు.
కాఫీలోని పాలిఫెనాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొని, దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి, తద్వారా గుండె పనితీరు మెరుపడుతుందట. అంతేగాదు గుండె వైఫల్యం, అరిథ్మియాస్ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే పక్షవాత మరణాలు 19% తగ్గుతాయి
ఎప్పటికీ తాగకూడని ఒక పద్ధతి
పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే దాన్ని ఎప్పుడూ తాగవద్దు. చల్లగా ఉంటేనే సురక్షితం. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే వేడి పానీయాలు అన్నవాహిక కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
పాటించాల్సిన 3 కాఫీ నియమాలు
మరీ వేడిగా ఉండకూడదు
మరీ తీపిగా ఉండకూడదు
మరీ ఆలస్యంగా ఉండకూడదు(మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంత మంచిది కాదు)
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.
ఇదీ చదవండి: స్టేజ్ 4 నోటి కేన్సర్ నుంచి 80 కేజీల బరువు ఎత్తే వరకు..! ఆ కొడుకు ప్రేమే..


