PC: X
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వీరోచిత సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను అద్భుతమైన పోరాటంతో బవుమా ఆదుకున్నాడు.
ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్(85)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో బవుమా 226 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సూపర్ సెంచరీతో బవుమా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన బవుమా
గెబెహాలోని సెయింట్ జార్జెస్ పార్క్‌లో టెస్టు సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బవుమా చరిత్రకెక్కాడు. 1992లో భారత్‌పై కేప్లర్ వెస్సెల్స్ 95 పరుగులే ఈ వేదికలో అత్యధిక స్కోర్‌గా ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో వెస్సెల్స్ రికార్డును బవుమా బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మైదానంలో టెస్టు సెంచరీ చేసిన ప్రపంచంలోనే మూడో కెప్టెన్‌గా అతడు నిలిచాడు.
రికార్డు సమం!
అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC)లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మార్‌క్రమ్(4) రికార్డును బవుమా(4) సమం చేశాడు. అతడి కెరీర్‌లోని 5 టెస్టు సెంచరీలలో 4 సెంచరీలు డబ్ల్యూటీసీ మ్యాచ్‌లోనే రావడం విశేషం.
బవుమా 165 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 123 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో బవుమాతో పాటు సైమర్ హర్మర్(69) ఉన్నాడు.
చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!


