PC: IPL/BCCI
ఐపీఎల్-2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మను తమ దీర్ఘకాలిక కెప్టెన్‌గా నియమించేందుకు ముంబై యాజమాన్యం సిద్దమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ తిరిగొస్తాడా?
అంతేకాకుండా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టు బాధ్యతలను చేపట్టనున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే రోహిత్ శర్మ తిరిగి నాయకత్వం వహించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించినప్పటికి, అతడి వయస్సు దృష్ట్యా మళ్లీ జట్టును నడిపించే ఛాన్స్ లేదు.
అరంగేట్రం నుంచి ముంబైలోనే
కాగా తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. తిలక్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ముంబై ఫ్రాంచైజీలోనే ఉన్నాడు. టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించగల సత్తా ఉన్న ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో ముంబైని విజయతీరాలకు చేర్చాడు.
అంతేకాకుండా తిలక్‌కు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. చాలా సిరీస్‌లలో భారత్-ఎ జట్టు కెప్టెన్‌గా అతడు వ్యహరించాడు. అతడు ప్రస్తుతం భారత సీనియర్ టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తమ లాంగ్ టెర్మ్ కెప్టెన్‌గా తిలక్‌ను నియమించేందుకు ముంబై సిద్దమైంది.
కెప్టెన్‌గా అట్టర్ ప్లాప్
గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్ర సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ సారథిగా మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టిన తొలి సీజన్(2024)లో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికి.. 2026లో మాత్రం మళ్లీ లీగ్ స్టేజీని దాటలేకపోయింది. దీంతో అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు ముంబై యాజమాన్యం కూడా విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై మరి కొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
చదవండి: SA vs AUS: మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు


