మిచెల్‌ స్టార్క్‌ ప్రపంచ రికార్డు | Mitchell Starc Scripts History, Breaks Glenn McGraths Record With 450 Test Wickets | Sakshi
Sakshi News home page

SA vs AUS: మిచెల్‌ స్టార్క్‌ ప్రపంచ రికార్డు

Oct 20 2026 3:48 PM | Updated on Oct 20 2026 4:09 PM

Mitchell Starc Scripts History, Breaks Glenn McGraths Record With 450 Test Wickets

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంతవేగంగా(బంతుల ప‌రంగా) 450 వికెట్ల మైలు రాయిని అంద‌కున్న ఫాస్ట్ బౌల‌ర్‌గా స్టార్క్‌ చ‌రిత్ర సృష్టించాడు. 

సెయింట్ జార్జ్ పార్క్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో వియాన్ ముల్డ‌ర్‌ను ఔట్ చేసి స్టార్క్ ఈ ఘ‌న‌త సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ స్టార్ కేవ‌లం 20,577 బంతుల్లో బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

ఇంత‌కుముందు ఈ ప్ర‌పంచ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్( 23,474 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్ ఆల్‌టైమ్ రికార్డును మిచెల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ కూడా అత‌డే కావ‌డం గ‌మ‌నార్హం.

ఓవరాల్‌గా 450 టెస్టు వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రికార్డు ఇప్పటికీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అత‌డి త‌ర్వాతి స్దానంలో భార‌త స్పిన్న‌ర్ అశ్విన్‌(89) ఉన్నాడు.

సూప‌ర్ ఫామ్‌లో స్టార్క్‌

కాగా ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. చాలా మ్యాచ్‌ల‌కు తోటి ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ గాయాలతో దూరమైనప్పటికీ, స్టార్క్ ఒంటిచేత్తో ఆసీస్ పేస్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. 

యాషెస్ సిరీస్‌లో కేవలం 5 మ్యాచుల్లోనే 31 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అంతేకాకుండా భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లు (మ్యాచ్‌ల పరంగా):

ముత్తయ్య మురళీధరన్ - 80 మ్యాచులు

రవిచంద్రన్ అశ్విన్ - 89 మ్యాచులు

అనిల్ కుంబ్లే - 93 మ్యాచులు

గ్లెన్ మెక్‌గ్రాత్ - 100 మ్యాచులు

షేన్ వార్న్ - 101 మ్యాచులు

మిచెల్ స్టార్క్ - 109 మ్యాచులు*

ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు:
షేన్ వార్న్ - 708 వికెట్లు

నాథన్ లయన్ - 573 వికెట్లు

గ్లెన్ మెక్‌గ్రాత్ - 563 వికెట్లు

మిచెల్ స్టార్క్ - 450* వికెట్లు

డెన్నిస్ లిల్లీ - 355 వికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement