PC: X
న్యూలాండ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా 176 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0 తేడాతో సొంతం చేసుకుంది. 288 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.
సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఐడైన్ మార్‌క్రమ్(78), మార్కెస్ అకర్మాన్(95), డేవిడ్ బెడింగ్‌హామ్(50), మార్కో జాన్సెన్(52) హఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీతో సత్తాచాటాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు.
నంబర్ వన్ జట్టుగా సౌతాఫ్రికా
ఈ విజయంతో సౌతాఫ్రికా ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. గత రెండున్నరేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా 124 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత స్ధానాల్లో ఆసీస్, న్యూజిలాండ్, భారత్ కొనసాగుతున్నాయి.
చదవండి: పాకిస్తాన్‌తో ఫైనల్.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్


