source: IPL X
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టడంతో మార్కో యాన్సెన్ (సౌతాఫ్రికా)ను రెండో స్థానానికి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. గత కొంతకాలంగా స్టార్క్, యాన్సెన్ మధ్య టెస్ట్ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ దోబూచులాడుతోంది.
ఈ వారం బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అతడు, ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మ్యాట్ హెన్రీ, ఓలీ రాబిన్సన్, స్కాట్ బోలాండ్, రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ టాప్-10లో కొనసాగుతున్నారు.
టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్రూక్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రూట్, హెడ్, బవుమా, స్టీవ్ స్మిత్, రచిన్ రవీంద్ర, పంత్, డారిల్ మిచెల్, గిల్, కమిందు మెండిస్ టాప్-10లో కొనసాగుతున్నారు.
టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో యాన్సెన్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. రవీంద్ర జడేజా టాప్-3గా ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన హార్మర్, ఆల్‌రౌండర్ల విభాగంలోనూ చెలరేగి టాప్-5లోకి (3 స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి) చేరాడు.
ఏడో స్థానానికి శ్రేయస్
టీ20 బ్యాటర్ల విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. భారత స్టార్ ఆటగాళ్లు అభిషేక్ వర్మ, ఇషాన్ కిషన్ 1, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్, ఆడమ్ జంపా, ఆదిల్ రషీద్ టాప్-3లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ప్లేస్‌కు చేరాడు. భారత్ తరఫున టాప్-10లో ఒక్కరు కూడా లేరు. అక్షర్ పటేల్ అత్యుత్తమంగా 14వ స్థానంలో నిలిచాడు.
టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సికందర్ రజా, సైమ్ అయూబ్ టాప్-2లో కొనసాగుతుండగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో భారత్ తరఫున అత్యుత్తమంగా హార్దిక్ పాండ్యా 15వ స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్ అరుదైన రికార్డు.. పదేళ్ల తర్వాత


