PC: BCCI/X
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 25 ఏళ్ల కాంబోజ్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా పేసర్ తన 10 ఓవర్ల కోటాలో 2 మైడెన్లతో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
కాంబోజ్ 2.20 ఎకానమీతో బౌలింగ్ చేసి కివీస్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశాడు. అన్షుల్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. తన రెండో మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. ఈ ప్రదర్శనతో అన్షుల్ అరుదైన ఘనత సాధించాడు.
న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌పై భారత్ తరఫున అత్యంత ఎకనామికల్ స్పెల్ (కనీసం 10 ఓవర్లు) బౌలింగ్ చేసిన నాలుగో బౌలర్‌గా కాంబోజ్ నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ పేసర్ జవగల్ శ్రీనాథ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 2003లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో శ్రీనాథ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
కివీస్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు
జవగల్ శ్రీనాథ్: 3/13 – ఆక్లాండ్, 2003 (ఎకానమీ: 1.30)
ఆశిష్ నెహ్రా: 2/16 – ఆక్లాండ్, 2002 (ఎకానమీ: 1.60)
కపిల్ దేవ్: 2/18 – ఆక్లాండ్, 1994 (ఎకానమీ: 1.80)
అన్షుల్ కంబోజ్: 2/22 – ఆక్లాండ్, 2026 (ఎకానమీ: 2.20)*
జవగల్ శ్రీనాథ్: 4/23 – ఆక్లాండ్, 2002 (ఎకానమీ: 2.30)
అంతేకాకుండా 2016లో జింబాబ్వేపై జస్ప్రీత్ బుమ్రా (1/22) సాధించిన గణాంకాల తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలో ఒక భారత పేసర్ నమోదు చేసిన అత్యుత్తమ ఎకనామికల్ స్పెల్ ఇదే కావడం విశేషం.


