ఆ ఇద్దరికి దక్కని చోటు.. తొలి వన్డేకు భారత జట్టు అంచనా! | Team India Predicted Playing XI Vs NZ-Ahead 1st ODI Revealed, Shubman Gill, Rohit Sharma And Virat Kohli Set To Return, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికి దక్కని చోటు.. తొలి వన్డేకు భారత జట్టు అంచనా!

Nov 3 2026 11:31 AM | Updated on Nov 3 2026 11:49 AM

Team India Predicted Playing XI Vs NZ-Ahead 1st ODI-Auckland

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 3-2తో దక్కించుకున్న టీమిండియా రేపటి నుంచి వన్డే సిరీస్ వేటకు సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా రేపు కివీస్‌, భారత్‌ల మధ్య తొలి వన్డే జరగనుంది. రోహిత్‌, కోహ్లి, గిల్ రాకతో జట్టు బలంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగి తేలిన మన ఆటగాళ్లు అసలు మ్యాచ్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లుగా వారు తమ తుది జట్టును అంచనా వేస్తున్నారు. కొందరు శ్రేయస్ అయ్యర్‌కు రెస్ట్ ఇచ్చి రుతురాజ్ గై​క్వాడ్‌ను ఆడిపిస్తారని కామెంట్లు చేయగా, వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగిన అయ్యర్‌ను పక్కనబెట్టే అవకాశం లేదని ఇంకొందరు పేర్కొన్నారు.

మెజారిటీ అభిమానులు ఎంపిక చేసిన తుదిజట్టు అంచనా ప్రకారం.. ఓపెనింగ్‌లో గిల్‌, రోహిత్ శర్మ రానున్నారు. వన్‌డౌన్‌లో కోహ్లి బ్యాటింగ్ చేయనున్నాడు.  శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. నమన్ ధీర్‌, అక్షర్ పటేల్‌, నితీశ్‌కుమార్ రెడ్డిలు ఆల్‌రౌండర్లుగా జట్టులో చోటు దక్కించుకున్నారు. 

ఇక సిరాజ్‌, అర్షదీప్‌, గుర్నూర్ బ్రార్‌లతో పేస్ విభాగం ఉండనుంది. ఈ జట్టులో ఇషాన్ కిషన్‌, రుతురాజ్ గై​క్వాడ్‌లకు చోటు దక్కలేదు. అంతేకాదు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవ‌కాశ‌మివ్వ‌లేదు. ఒక‌వేళ గుర్నూర్ వ‌ద్ద‌నుకుంటే అప్పుడు కుల్దీప్ జ‌ట్టులో ఉండ‌నున్నాడు. 

అక్షర్ పటేల్‌, నమన్ ధీర్‌లు స్పిన్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అభిమానుల అంచనా మాత్రమే కావడంతో తుది జట్టు ఎలా ఉండబోతుందనేది రేపు మ్యాచ్ ప్రారంభానికి ముందు తెలియనుంది. అయితే నితీశ్ రెడ్డి తొలి వ‌న్డేకు మాత్రమే అందుబాటులో ఉండ‌డంతో అత‌డు ఆడ‌డం ఖాయ‌మే.

ఇప్ప‌టివ‌ర‌కు న్యూజిలాండ్‌, టీమిండియా ముఖాముఖి పోరులో 123సార్లు ఎదురుప‌డ్డాయి. ఇందులో భార‌త్ 63 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, కివీస్ 52 విజ‌యాలు సాధించింది. ఏడు మ్యాచ్‌లు ర‌ద్ద‌వ్వ‌గా.. ఒక మ్యాచ్ ఫ‌లితం రాలేదు.

భార‌త తుదిజ‌ట్టు అంచ‌నా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్/గుర్నూర్ బ్రార్‌, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఇదీ చదవండి: కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం

డ్రాగా ముగిసిన మ్యాచ్‌.. టీమిండియాకు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement