కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం | Devon Conway Suffers Concussion After Collision With Matt Henry, Ruled Out Of 1st ODI Against India, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం

Nov 3 2026 10:46 AM | Updated on Nov 3 2026 11:23 AM

Devon-Conway Concussed After Collision-Ruled-Out-1st ODI Vs IND

ఆక్లాండ్ వేదికగా రేపు టీమిండియాతో తొలి వన్డే నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తొలి వన్డేకు దూరమయ్యాడు. వన్డే సిరీస్ నేపథ్యంలో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో మంగళవారం కివీస్‌ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ఒక క్యాచ్ అందుకునే క్రమంలో కాన్వే, ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో కాన్వే తలకి తీవ్రమైన దెబ్బ తగలడంతో మెడికల్ టీమ్ వెంటనే అతనికి పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆసుపత్రికి తరలించి స్కాన్ చేయగా అతడు కంకషన్‌కు (తలకు గాయం) గురైనట్లు నిర్ధారణ అయింది. దీంతో భారత్‌తో జరిగే మొదటి వన్డే మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇప్పటికే రచిన్ రవీంద్ర (భుజం గాయం), మార్క్ చాప్‌మన్ (కండరాల గాయం), విలియం రూర్టిర్కీ, బెన్ సియర్స్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో వన్డే సిరీస్‌కు దూరమవ్వగా, ఇప్పుడు కాన్వే కూడా కంకషన్‌కు గురవ్వడం కివీస్ జట్టుకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

ఈ ఏడాది జన‌వ‌రిలో భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో పాల్గొన్న కాన్వే ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో వ‌న్డే మ్యాచ్ ఆడ‌లేదు. అయితే జూన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టులో కాన్వే (157 ప‌రుగులు) అద్భుత శ‌త‌కం సాధించాడు. 

కివీస్‌ తమ సొంత‌గ‌డ్డ‌పై వన్డే సిరీస్‌ ఆడుతుండ‌డంతో కీల‌క‌మ‌వుతాడ‌నుకున్న కాన్వే ఇలా కంక‌ష‌న్‌కు గుర‌వ్వ‌డం ఆ జట్టుకు పెద్ద‌దెబ్బే అని చెప్పొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు కాన్వే 43 వ‌న్డేల్లో 1692 ప‌రుగులు సాధించాడు. ఇందులో 5 శ‌త‌కాలు, ఆరు అర్థ‌సెంచ‌రీలున్నాయి. 

ఇదీ చదవండి: NZ-A Vs IND-A: డ్రాగా ముగిసిన మ్యాచ్‌.. టీమిండియాకు శుభవార్త

'హ‌ర్మ‌న్‌ప్రీత్‌ నా ఫోన్‌కాల్స్ ఎత్త‌లేదు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement