పాపం వైభవ్‌ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్‌ | Shreyas Iyer Shuts Team India Door For Vaibhav Sooryavanshi In T20Is | Sakshi
Sakshi News home page

IND vs NZ: పాపం వైభవ్‌ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్‌

Oct 21 2026 4:21 PM | Updated on Oct 21 2026 5:06 PM

Shreyas Iyer Shuts Team India Door For Vaibhav Sooryavanshi In T20Is

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి న్యూజిలాండ్ టూర్‌లోనూ నిరాశే ఎదురుకానుంది. ప్రధాన జట్టులో చోటు దక్కినప్పటికీ, తుది జట్టులో అవకాశం లభించడం కష్టమేనని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా నిలకడగా రాణిస్తుండటంతో, వైభవ్ తన అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని శ్రేయస్ అన్నాడు..

ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ టూర్‌లో అరంగేట్రం చేసిన వైభవ్, భారత్ ఆడిన గత 21 టీ20ల్లో కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే తుది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. వరుసగా అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ సిరీస్‌లలోనూ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

వైభవ్ వేచి ఉండాల్సిందే!
"వైభవ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టులో అభిషేక్, సంజూ నిలకడగా పరుగులు సాధిస్తుండటంతో ప్రస్తుతానికి వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. కానీ, అతడు జట్టుతోనే ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. 

డ్రెసింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నాడు. అతడు చాలా చిన్నవాడు కాబట్టి, భవిష్యత్తులో అతనికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి అని అయ్య‌ర్ తొలి టీ20కు ముందు ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో వ్యాఖ్యనించాడు.

అలాగే విదేశీ పర్యటనల ప్రాముఖ్యతను వివరిస్తూ... "విదేశీ టూర్‌లలో జట్టుతో పాటు ప్రయాణించడం ద్వారా ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలో యువ ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన వస్తుంది. భవిష్యత్తులో మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మరింత సన్నద్ధతతో బరిలోకి దిగవచ్చు. అంతేకాకుండా, తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చే ఇతర జట్టు సభ్యులకు కూడా అతను తగిన సూచనలు ఇవ్వగలడు" అని అయ్యర్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement