breaking news
Bangladesh Vs Zimbabwe
-
నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్లు.. వణికిపోయిన జింబాబ్వే బ్యాటర్లు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పలు చెరిగారు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. షోరిఫుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తన్వీర్ ఇస్లాం తలా రెండు, సైఫుద్దీన్ సాధించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో మాధవీరే(75), బ్రాడ్ ఎవాన్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కాగా ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో జింబాబ్వే సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా జింబాబ్వే ఘన విజయం సాధించింది.తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగా -
క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన జింబాబ్వేకు షాక్!
బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోన్న జింబాబ్వే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ రిచర్డ్ నగరవా మూడో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సికందర్ రజా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే మ్యాచ్‌లో రిచర్డ్ నగరవా ఆడకపోవడంపై టాస్ సమయంలో సికందర్ రజా క్లారిటీ ఇచ్చాడు. వర్క్‌లోడ్ కారణంగానే రిచర్డ్ నగరవాకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించినట్లు సికందర్ రజా పేర్కొన్నాడు. నగరవాతో పాటు జట్టుకు ఆయువుపట్టు అయిన బ్లెసింగ్ ముజరబానీతో పాటు న్యూమన్ నైమురీకి కూడా మూడో వన్డేకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నుంచి రిచర్డ్ నగరవా రెస్ట్ లేకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతూనే వస్తున్నాడు. రాబోయే రోజుల్లో భారత్‌తో కీలకమైన టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొనే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుందని సికందర్ రజా వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో జింబాబ్వే కెప్టెన్ రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బంగ్లా బౌలర్ నహీద్ రానా 7 వికెట్లతో టాప్‌లో ఉండగా, రిచర్డ్ నగరవా ఆరు వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. కాయా (4), క్రెయిగ్ ఇర్విన్ (0) క్రీజులో ఉన్నారు. తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగాచదవండి: ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు! -
దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం పాలైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఓడి సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న బంగ్లాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది.కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలుత ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగ్గా.. ఊహించని రీతిలో ఆతిథ్య జట్టు బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో మట్టికరిపించింది.వన్డే సిరీస్ జింబాబ్వేదేఅనంతరం హరారేలో సోమవారం తొలి వన్డే జరగ్గా.. జింబాబ్వే బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై గురువారం జరిగిన ఉత్కంఠపోరులోనూ జింబాబ్వేనే పైచేయి సాధించింది. బంగ్లాను 13 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే ఓపెనర్ బెన్ కర్రాన్ అజేయ సెంచరీ (111*)తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.జరిమానా విధించిన ఐసీసీఇక జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా బంగ్లాకు జరిమానా విధించినట్లు ప్రకటన విడుదల చేసింది.‘‘హరారేలో గురువారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ వారి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నాం.నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన ఓవర్లు పూర్తి చేయనందున ఈ మేరకు జరిమానా విధించాము’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా జింబాబ్వే- బంగ్లాదేశ్ మధ్య శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఇందుకు హరారే వేదిక.చదవండి: అతడు భయపడుతున్నాడు.. టీమిండియా నుంచి తీసేయండి! -
జింబాబ్వే ఓపెనర్ సూపర్ సెంచరీ.. బంగ్లాదేశ్‌కు పరీక్ష!
సొంతగడ్డపై జింబాబ్వే అదరగొడుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో అనూహ్య రీతిలో ఇన్నింగ్స్ మీద 85 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే.. వన్డేల్లోనూ శుభారంభం అందుకుంది.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో పర్యాటక బంగ్లా జట్టును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 141 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఆతిథ్య జట్టు సఫలమైంది.బంగ్లాదేశ్‌ను 116 పరుగులకే ఆలౌట్ చేసి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం నాటి రెండో వన్డేలో జింబాబ్వే.. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారీ స్కోరే సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ డకౌట్ కాగా.. బెన్ కర్రాన్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో సికిందర్ రజా చెప్పుకోగదగ్గ స్కోరు (33) చేయగా.. లోయర్ ఆర్డర్లో బ్రాడ్ ఎవాన్స్ మెరుపులు మెరిపించాడు.కేవలం 38 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెన్ కర్రాన్, ఎవాన్స్ ఇన్నింగ్స్ కారణంగా జింబాబ్వే 247 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. నహీద్ రాణా, రిషాద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక తొలి వన్డేలో 116 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. ఈసారి 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఒక రకంగా కఠిన పరీక్షే!!


