నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్లు.. వణికిపోయిన జింబాబ్వే బ్యాటర్లు | Madhevere and Evans fifties take Zimbabwe to 199 | Sakshi
Sakshi News home page

BAN vs ZIM: నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్లు.. వణికిపోయిన జింబాబ్వే బ్యాటర్లు

Jul 11 2026 5:44 PM | Updated on Jul 11 2026 6:03 PM

Madhevere and Evans fifties take Zimbabwe to 199

హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న నామ‌మాత్ర‌పు మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్ బౌల‌ర్లు నిప్ప‌లు చెరిగారు. ముఖ్యంగా పేస‌ర్ షోరిఫుల్ ఇస్లాం ఆతిథ్య జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. షోరిఫుల్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 44 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అత‌డితో పాటు టాస్కిన్ అహ్మ‌ద్‌, త‌న్వీర్ ఇస్లాం త‌లా రెండు, సైఫుద్దీన్  సాధించారు. ఫ‌లితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.1 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. జింబాబ్వే బ్యాటర్లలో మాధవీరే(75), బ్రాడ్‌ ఎవాన్స్‌(50) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కాగా ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో జింబాబ్వే సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా జింబాబ్వే ఘన విజయం సాధించింది.

తుదిజట్లు:
బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీప‌ర్‌), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్‌), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాం

జింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్‌), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీప‌ర్‌), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement