breaking news
taskin Ahmed
-
నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్లు.. వణికిపోయిన జింబాబ్వే బ్యాటర్లు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పలు చెరిగారు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. షోరిఫుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తన్వీర్ ఇస్లాం తలా రెండు, సైఫుద్దీన్ సాధించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో మాధవీరే(75), బ్రాడ్ ఎవాన్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కాగా ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో జింబాబ్వే సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా జింబాబ్వే ఘన విజయం సాధించింది.తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగా -
మరో వివాదానికి తెర లేపారు..
బంగ్లాదేశ్ బౌలర్ చేతిలో ధోని తల ఇంటర్నెట్లో పోస్టర్ హల్చల్ ఢాకా: భారత్‌తో మ్యాచ్ అంటే ఇప్పటిదాకా పాకిస్తాన్ అభిమానులు మాత్రమే యమ సీరియస్‌గా తీసుకునేవారు. కానీ గత ఏడాదికాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ ప్రేమికులు కూడా ఎందుకో ధోని సేనతో మ్యాచ్ అంటే కసితో ఊగిపోతున్నారు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగే ఆసియా కప్ టి20 ఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ ఎంఎస్ ధోనిని అవమానపరుస్తూ ఓ వివాదాస్పద పోస్టర్ సోషల్ మీడియాలో పాకిపోతోంది. ధోని తలను బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ చేతిలో పట్టుకున్నట్టు ఈ గ్రాఫిక్ ఫొటో ఉంది. ఇది ఎవరు పెట్టారనేది తేలకపోయినా భారత అభిమానులను రెచ్చగొట్టేందుకన్నట్టుగా కనిపిస్తోంది. గతేడాది కూడా భారత జట్టు సభ్యులను అవమానకరంగా చిత్రీకరించిన ఫొటో అక్కడి పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటి సిరీస్‌లో ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు తెగ ఇబ్బందిపడ్డారు. ఈ వైనాన్ని గుర్తుచేస్తూ భారత క్రికెటర్లకు ముస్తఫిజుర్ కట్టర్స్‌తో గుండు గీసినట్టుగా ఆ ఫొటోను ప్రచురించారు.


