breaking news
Shoriful Islam
-
చరిత్ర సృష్టించిన బంగ్లా ప్లేయర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ఆ జట్టు ఎడమచేతి వాటం పేసర్ షోరిఫుల్ ఇస్లాం అరుదైన రికార్డు సాధించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీసిన షోరిఫుల్.. 140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం పేసర్‌గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్‌లో షోరిఫుల్ కేవలం 15 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. షోరిఫుల్ ఈ స్థాయిలో చెలరేగినా, బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలం కావడంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.1886 తర్వాత ఇదే తొలిసారిఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన చివరి ఎడమచేతి వాటం పేసర్ ఇంగ్లండ్‌కు చెందిన డిక్ బార్లో. 1886లో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో బార్లో 44 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాత 140 ఏళ్ల పాటు ఏ ఎడమచేతి వాటం పేసర్ కూడా ఆస్ట్రేలియాపై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల మార్క్‌ను అందుకోలేదు. షోరిఫుల్ ఇస్లాం ఇప్పుడు ఆ అరుదైన ఫీట్‌ను సాధించాడు.అయితే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు మాత్రం ఇంగ్లండ్ దిగ్గజం జిమ్ లేకర్ పేరిట ఉన్నాయి. 1956 జూలైలో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ మొత్తం 10 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లను కేవలం 53 పరుగులకే ఔట్ చేశాడు.భారీ ఓటమి.. ర్యాంకింగ్స్‌లో చారిత్రక పురోగతిషోరిఫుల్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో ముగిసింది.అయితే ఈ సిరీస్ అనంతరం విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ చారిత్రక పురోగతి సాధించింది. మూడు స్థానాలు ఎగబాకి, తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో తమకంటే చాలా మెరుగైన వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఆ జట్టు రేటింగ్ 78గా ఉంది. -
బంగ్లా బౌలర్ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో షోరిఫుల్ 7 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (67) కీలక అర్ధసెంచరీతో రాణించగా, స్టీవ్ స్మిత్ (42) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో నాథన్ లియోన్ (32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్ 7 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్, మెహదీ హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నజ్ముల్ 12, తంజిద్ హసన్ (8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కనబరుస్తూ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ 125 పరుగులు వెనుకబడి ఉంది.రెండో బౌలర్‌గా రికార్డుఇక ఏడు వికెట్లతో మెరిసిన షోరిఫుల్ ఇస్లామ్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో బౌలర్‌గా షోరిఫుల్ నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా హసన్ మహ్ముద్ నిలిచాడు. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనే హసన్ మహ్ముద్ (6/55) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.టెస్టుల్లో బంగ్లాదేశ్ పేసర్ల అత్యుత్తమ గణాంకాలు👉షోరిఫుల్ ఇస్లామ్ (7/48) 2026లో ఆస్ట్రేలియాపై👉షాహదత్ హొసెన్ (6/27) 2008లో సౌతాఫ్రికాపై👉ఎబాదత్ హొసెన్ (6/46) 2022లో న్యూజిలాండ్‌పై👉హసన్ మహ్ముద్ (6/55) 2026లో ఆస్ట్రేలియాపై👉తస్కిన్ అహ్మద్ (6/64) 2024లో వెస్టిండీస్‌పైSEVEN-FOR SHORIFUL! 🔥🔥🇧🇩 What a performance! Shoriful Islam is tearing through the Australian batting lineup with a sensational 7-wicket haul! 🎯💥Take a bow, Shoriful! 👏🏏Australia 🆚 Bangladesh | 2nd Test#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/4EYAIt25Fd— Bangladesh Cricket (@BCBtigers) August 23, 2026 Shoriful Islam went bang to claim his first Test five-wicket haul, before topping it with an even better sixth! #MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/kmK6ZOZupX— cricket.com.au (@cricketcomau) August 22, 2026Read: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’ -
ఇటు స్టార్క్... అటు షరీఫుల్
మెక్కాయ్ (ఆ్రస్టేలియా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న ఆ్రస్టేలియా జట్టు... రెండో టెస్టులో సత్తా చాటింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో కంగారూ పేసర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షరీఫుల్ (14) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 10 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో అదరగొట్టగా... కెప్టెన్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (81 బంతుల్లో 51 బ్యాటింగ్; 8 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... స్టీవ్ స్మిత్ (42) ఫర్వాలేదనిపించాడు. దీంతో తొలి రోజే 18 వికెట్లు నేలకూలాయి. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లామ్ 6 వికెట్లు తీశాడు. చేతిలో రెండు వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
బంగ్లాదేశ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
మెకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడితో కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడు వికెట్లు సాధించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమమ్యారు. 11వ నంబర్ బ్యాటర్ షోరిఫుల్ ఇస్లాం(14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తైజుల్ ఇస్లామ్‌తో కలిసి చివరి వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యాన్ని షోరిఫుల్ నెలకొల్పాడు. ఈ క్రమంలో షోరిఫుల్ ఇస్లాం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 150 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఆస్ట్రేలియాపై పదకొండవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా షోరిఫుల్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా బంగ్లా తరపున ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా షోర్ఫుల్ నిలిచాడు. గతంలో భారత్‌పై తల్హా జుబేర్ 11వ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు సాధించాడు.బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ షోరిఫుల్ సత్తాచాటాడు. ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. అతడి బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(51), నాథన్ లియోన్(10) ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఆసీస్‌ను బంగ్లా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా -
ఆసీస్‌ను గడగడలాడించిన షొరీఫుల్.. పోరాడుతున్న బంగ్లాదేశ్
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజే ఏకంగా 18 వికెట్లు నేలకూలాయి. తొలుత ఆసీస్ బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను 64 పరుగులకే కుప్పకూల్చగా.. ఆతర్వాత బంగ్లాదేశ్ కూడా అద్భుతంగా పోరాడి ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షొరీఫుల్ ఇస్లాం (6-35) ధాటికి ఆసీస్ 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కెమరూన్ గ్రీన్ (51 నాటౌట్), నాథన్ లియోన్ (10 నాటౌట్) ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.BANGLADESH FAST BOWLERS ARE NIGHTMARE FOR AUSTRALIA 🥶- We are witnessing greatness in making. pic.twitter.com/pqqEDbcgCY— Johns. (@CricCrazyJohns) August 22, 2026తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 101 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గ్రీన్, లియోన్‌తో పాటు హెడ్ (22), స్టీవ్ స్మిత్ (42) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెన్షా (8), లబూషేన్ (4), క్యారీ (5), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. వెబ్‌స్టర్, కమిన్స్ డకౌట్లయ్యారు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్తో పాటు తస్కిన్ అహ్మద్ (1-41), మెహిది హసన్ మిరాజ్ (1-4) వికెట్లు తీశారు.నిప్పులు చెరిగిన స్టార్క్అంతకుముందు మిచెల్ స్టార్క్ (10-6-12-6) నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ 64 పరుగులకు కుప్పకూలింది. కమిన్స్ 3, హాజిల్‌వుడ్ ఓ వికెట్‌తో స్టార్క్‌కు సహకరించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కాగా.. మెహిది హసన్ (11), హసన్ మహమూద్ (10), తైజుల్ ఇస్లాం (11 నాటౌట్), షొరీఫుల్ ఇస్లాం (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో పర్యాటక బంగ్లాదేశ్ తొలి టెస్ట్‌లో సంచలన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్లు.. వణికిపోయిన జింబాబ్వే బ్యాటర్లు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పలు చెరిగారు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. షోరిఫుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తన్వీర్ ఇస్లాం తలా రెండు, సైఫుద్దీన్ సాధించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో మాధవీరే(75), బ్రాడ్ ఎవాన్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కాగా ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో జింబాబ్వే సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా జింబాబ్వే ఘన విజయం సాధించింది.తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగా -
పాకిస్తాన్‌కు ఫ్యూజులు ఎగరగొట్టిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొని ఫ్యూజులు ఎగురగొట్టింది. ఇవాళ (జులై 22) ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 134 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ బౌలర్లు సైతం అద్భుతంగా కట్టడి చేశారు. సల్మాన్ మీర్జా (4-1-17-2), అబ్బాస్ అఫ్రిది (4-0-37-2), అహ్మద్ దనియాల్ (4-0-23-2), ఫహీమ్ అష్రాఫ్ (3-0-20-1), మొహమ్మద్ నవాజ్ (3-0-19-1) చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ 133 పరుగులకే ఆలౌటైంది. జాకెర్ అలీ (55), మెహిది హసన్ (33) అద్బుతంగా పోరాడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో ఫహీమ్ అష్రాఫ్ (51) వీరోచితంగా పోరాడి పాక్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి పాక్‌ను 125 పరుగులకే పరిమితం చేశారు. మెహిది హసన్ (4-0-25-2), షొరిఫుల్ ఇస్లాం (4-0-17-3), తంజిమ్ హసన్ సకీబ్ (4-0-23-2), ముస్తాఫిజుర్ (3.2-0-15-1), రిషద్ హొసేన్ (4-0-42-1) పాక్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 జులై 24న జరుగనుంది.


