బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ ప్రపంచ రికార్డు | Shoriful Islam creates history as first No. 11 batter to top-score against Australia in Test Cricket | Sakshi
Sakshi News home page

BAN vs AUS: బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ ప్రపంచ రికార్డు

Aug 22 2026 3:14 PM | Updated on Aug 22 2026 3:52 PM

Shoriful Islam creates history as first No. 11 batter to top-score against Australia in Test Cricket

మెకే వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా జ‌ట్టు కేవ‌లం 64 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లు ప‌డ‌గొట్టి బంగ్లాదేశ్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో కెప్టెన్ పాట్ క‌మిన్స్ కూడా మూడు వికెట్లు సాధించాడు. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమమ్యారు. 11వ నంబర్‌ బ్యాటర్‌ షోరిఫుల్‌ ఇస్లాం(14) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  తైజుల్ ఇస్లామ్‌తో కలిసి చివరి వికెట్‌కు 25 పరుగుల భాగ‌స్వామ్యాన్ని షోరిఫుల్‌ నెల‌కొల్పాడు. ఈ క్రమంలో షోరిఫుల్‌ ఇస్లాం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

150 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఆస్ట్రేలియాపై పదకొండవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా షోరిఫుల్‌ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా బంగ్లా తరపున ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా షోర్‌ఫుల్ నిలిచాడు. గతంలో భారత్‌పై తల్హా జుబేర్ 11వ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు సాధించాడు.

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ షోరిఫుల్‌ సత్తాచాటాడు. ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. అతడి బౌలింగ్‌ ధాటికి ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్‌(51), నాథన్‌ లియోన్‌(10) ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఆసీస్‌ను బంగ్లా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్‌.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement