తెలుగు బ్లాక్‌హాక్స్‌ జట్టుకు కాంస్యం | Bronze for the Telugu Blackhawks team | Sakshi
Sakshi News home page

తెలుగు బ్లాక్‌హాక్స్‌ జట్టుకు కాంస్యం

Nov 23 2026 2:55 AM | Updated on Nov 23 2026 2:55 AM

Bronze for the Telugu Blackhawks team

భువనేశ్వర్‌: సెంట్రల్‌ ఏషియన్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ (కావా) వాలీబాల్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్‌ హాక్స్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ 25–23, 21–25, 25–17, 25–22తో జెటిసు వాలీబాల్‌ క్లబ్‌ (కజకిస్తాన్‌) జట్టుపై గెలిచింది. బ్లాక్‌ హాక్స్‌ ప్లేయర్‌ హెక్టర్‌ అలెక్సిస్‌ క్రూజ్‌ 29 పాయింట్లతో మెరిపించాడు. 

ఈ కాంస్య పతక విజయం బ్లాక్‌హాక్స్‌ ఫ్రాంచైజీకి ఒక గొప్ప మైలురాయిగా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత క్లబ్‌ వాలీబాల్‌ సామర్థ్యం, పోటీతత్వం పెరుగుతున్నాయనే విషయాన్ని చాటిచెప్పిందని బ్లాక్‌ హాక్స్‌ యజమాని కంకణాల అభిõÙక్‌ రెడ్డి అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement