72 ఏళ్ల తర్వాత... | Indian pair wins medal in mixed doubles at Asian TT Championship | Sakshi
Sakshi News home page

72 ఏళ్ల తర్వాత...

Oct 24 2026 4:33 AM | Updated on Oct 24 2026 4:33 AM

Indian pair wins medal in mixed doubles at Asian TT Championship

ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీకి పతకం  

తాష్కెంట్‌: సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 72 ఏళ్ల తర్వాత ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు పతకం లభించింది. హర్మీత్‌ దేశాయ్‌–యశస్విని ఘోర్పడే ద్వయం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌  డబుల్స్‌ సెమీఫైనల్లో హర్మీత్‌–యశస్విని జోడీ 9–11, 9–11, 8–11తో సోరా మత్సుషిమా–మివా హరిమోటో (జపాన్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన హర్మీత్‌–యశస్విని రెండో రౌండ్‌లో 14–12, 12–10, 11–7తో మొహమ్మద్‌ నెగారా–సిత్ర రస్మి (ఇండోనేసియా)లపై....ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 11–6, 12–10, 11–13, 11–7తో సు సియెన్‌ చియా–వు యింగ్‌ సియువాన్‌ (చైనీస్‌ తైపీ)లపై...క్వార్టర్‌ ఫైనల్లో 11–6, 8–11, 8–11, 11–9, 11–9తో పార్క్‌ గ్యాంగ్‌హైన్‌–లీ డాయున్‌ (కొరియా)లపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మానవ్‌  ఠక్కర్, మహిళల సింగిల్స్‌లో సిండ్రెల్లా దాస్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌–మనుశ్‌ షా (భారత్‌)... మహిళల డబుల్స్‌లో యశస్విని–స్వస్తిక (భారత్‌) జోడీలు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement