ఇండోర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో రైల్వేస్ బౌలర్ జంషేద్ ఆలమ్ ‘హ్యాట్రిక్’తో అద్భుతం చేశాడు. సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు పేస్ బౌలర్ జంషేద్ ఆలమ్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో జంషేద్ వరుసగా హార్దిక్ దేశాయ్, ప్రేరక్ మన్కడ్, రుచిత్ అహిర్, సమర్ గజ్జర్‌లను అవుట్ చేశాడు.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జంషేద్ ఆలమ్ (5/38) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. కర్ణాటక బౌలర్ అభిమన్యు మిథున్ (హరియాణపై 2018లో), విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే (కర్ణాటకపై 2021లో) తర్వాత టి20ల్లో వరుసగా 4 బంతుల్లో 44 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జంషేద్ గుర్తింపు పొందాడు.


