రావన్ని వలసనైనికి వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Mohan Reddy congratulated Ravanna Valasanaini | Sakshi
Sakshi News home page

రావన్ని వలసనైనికి వైఎస్ జగన్ అభినందనలు

Oct 20 2026 12:39 PM | Updated on Oct 20 2026 1:05 PM

YS Jagan Mohan Reddy congratulated Ravanna Valasanaini

సాక్షి, తాడేపల్లి: 2026 ఆసియా పారా గేమ్స్- మహిళల 1500 మీటర్ల T11 విభాగంలో కాంస్య పతకం సాధించిన రావన్ని వలసనైనికి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.  పట్టుదల, అంకితభావం, నిరంతర కృషితో అద్భుత విజయాన్ని సాధించారన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడే స్ఫూర్తికి నిదర్శనంగా  ఈ విజయం నిలిచిందన్నారు.  రావన్ని.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ భారతదేశం గర్వించేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయం ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా రావన్ని వలసనైనిని ప్రశంసించారు.


ఇదీ చదవండి: మన టైమ్ వస్తుంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement