వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై పోలీసుల దౌర్జన్యం | Alur Under Siege: SI Vijay Dragged YSRCP Candidate from Home | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై పోలీసుల దౌర్జన్యం

Oct 20 2026 12:36 PM | Updated on Oct 20 2026 1:00 PM

Alur Under Siege: SI Vijay Dragged YSRCP Candidate from Home

సాక్షి,కర్నూలు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రగడ సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు తోడు, కొన్నిచోట్ల పోలీసులే ప్రత్యక్షంగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు సాగిస్తున్న దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై లాఠీఛార్జ్‌కు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం..
కర్నూలు పరిధిలో నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునే క్రమంలో పోలీసులు హద్దులు మీరారు. ఇంట్లో ఉన్న ఒక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని స్థానిక ఎస్‌ఐ విజయ్ తన సిబ్బందితో కలిసి బలవంతంగా బయటకు లాక్కకెళ్లిన ఘటన స్థానికుల్ని భయాందోళనకు గురి చేసింది. ఈ అక్రమ చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళలని కూడా చూడకుండా ఎస్‌ఐ విజయ్ వారిపై చేయి చేసుకుని దాడికి పాల్పడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement