సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని 67వ వార్డు (శారదా కాలనీ) ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంది. నగరపాలక సంస్థలో ఆప్కాస్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈదులమూడి సరోజినీదేవి రాజీనామా చేయకుండానే నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ లేదా కార్పొరేషన్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పోటీ చేయాలంటే తప్పనిసరిగా తమ ఉద్యోగానికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. సరోజినీదేవి రాజీనామా పత్రాలు సమరి్పంచకుండానే 67వ వార్డుకు నామినేషన్ వేయడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా దాఖలైన ఈ నామినేషన్‌పై ఎన్నికల అధికారులు పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


