డోన్ నామినేషన్ పరిశీలన కేంద్రంలో తిష్ట వేసిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ
నంద్యాల: డోన్ మాజీ ఎమ్మెల్యే, నగరపాలక టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ సోమవారం నామినేషన్ కేంద్రంలో హల్‌చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున పరిశీలకులుగా వెళ్లిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన గదిలో తిష్ట వేసిన సుజాతమ్మ వైఎస్సార్‌సీపీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని అధికారులను పట్టుబట్టినట్లు తెలిసింది.
ఈ తతంగాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా వీక్షిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు ఫోన్ చేసి నచ్చజెప్పినా వినలేదు. సాయంత్రం 3.30 గంటల వరకు అక్కడే తిష్ట వేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, మద్దతుదారులను నానాదుర్భాషలాడారు. సాయం కాలం లోపు నామినేషన్లు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సివస్తుందని తమను సుజాతమ్మ బెదిరించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు వాపోయారు. చిన్న పదవి కోసం తన స్థాయిని మరిచి ఆమె ప్రవర్తించడం సబబుగా లేదన్నారు.
నామినేషన్లు వేయక ముందు నుంచి అందరిని బెదిరించి అందులో కొంత మందిని నామినేషన్ వేయకుండా చేయగలిగారని వారు ఆరోపించారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు నామినేషన్ల పరిశీలన ముగించడంతో అటు అధికారులు, ఇటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఊపిరి పిల్చుకున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థులుగా వివిధ పారీ్టల నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా సోమవారం పరిశీలనలో ఇద్దరు అభ్యర్థల నామినేషన్ పత్రాలు సక్రమంగా లేనందున తిరస్కరించగా చైర్‌సర్సన్ ఎన్నికల బరిలో 11 మంది మిగిలారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలా జరగలేదు


