దసరా పండుగ : సింగర్‌ ఇంటికి కొత్త లగ్జరీ కారు | Singer Rahul sipligunj buys a brand-new tesla car on Dussehra | Sakshi
Sakshi News home page

దసరా పండుగ : సింగర్‌ ఇంటికి కొత్త లగ్జరీ కారు

Oct 20 2026 11:09 AM | Updated on Oct 20 2026 11:41 AM

Singer Rahul sipligunj buys a brand-new tesla car on Dussehra

ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత  రాహుల్ సిప్లిగంజ్ దసరా  సందర్భంగా  కొత్త  లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు.  టెస్లా (Tesla) కారు ఇంటికి తెచ్చుకున్నామంటూ రాహుల్‌ స్వయంగా ఇన్‌స్టాలో వెల్లడించారు.  తన భార్య హరిణ్యతో కలిసి ఫోజులిచ్చిన ఫోటోలను షేర్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ ఈ దంపతులకు శుభాకాంక్షలు అందిస్తున్నారు.



"భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రత్యేక సందర్భంలో కొత్త వాహనం" (A New Vahanam on this special occasion) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు అభినందలు తెలిపారు.  కాగా  రాహుల్  గ్యారేజ్‌లో ఇప్పటికే  మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.  రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను గత ఏడాది నవంబర్ 27న పెళ్లాడిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!


 

 

ఇదీ చదవండి: నీటి బుడగ జీవితం గురించి బోధిస్తుండగానే ప్రాణం పోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement