మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఎదురుదెబ్బ | TDP Councilor Candidate Nomination Rejected | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఎదురుదెబ్బ

Oct 20 2026 11:23 AM | Updated on Oct 20 2026 11:31 AM

TDP Councilor Candidate Nomination Rejected

పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి షాక్‌ తగిలింది. 9వ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా కొల్లు పెద్దిరాజు నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. పెద్దిరాజు రాష్ట్ర మత్స్యకార అభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. కార్పొరేషన్‌ నుంచి జీతం తీసుకుంటూ మళ్లీ కౌన్సిలర్‌గా పోటీ చేయడం అర్హత కాని కారణంగా నామినేషన్‌ తిరస్కరించినట్టు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, నరసాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకటరామరెడ్డి తెలిపారు. 

ఈ ఒక్క నామినేషన్‌ తప్ప డమ్మీ అభ్యర్థులతో కలిపి మిగిలిన అన్నింటినీ ఆమోదించారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వానికి ఐదు నామినేషన్లు దాఖలు కాగా.. మొత్తం ఆమోదించారు. 36 వార్డుల్లో కౌన్సిలర్ల అభ్యరి్థత్వాలకు 164 నామినేషన్లు రాగా.. 163 ఆమోదించినట్టు వెంకటరామరెడ్డి తెలిపారు. అభ్యర్థులు పార్టీ బీ–ఫామ్‌లు కూడా అందించారు. మొత్తంగా వైఎస్సార్‌సీపీ నుంచి కౌన్సిలర్లుగా 73, టీడీపీ నుంచి 36, జనసేన నుంచి 36, స్వతంత్రులు 13, బీజేపీ నుంచి 2, సీపీఎం నుంచి 2, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఒక నామినేషన్‌ను ఆమోదించారు.  

ఆకివీడులో రెండు నామినేషన్ల తిరస్కరణ 
ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన సోమవారం నిర్వహించారు. 28 వార్డులకు 127 నామినేషన్లు దాఖలు కాగా రెండు తిరస్కరించినట్టు కమిషనర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. 18వ వార్డులో కంచర్ల సుజాత వైఎస్సార్‌సీపీ తరఫున రెండు నామినేషన్‌లు దాఖలు చేయగా వాటిలో ఒకటి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా తక్కువ ఫీజు చెల్లించడంతో తిరస్కరించామన్నారు. అలాగే 28వ వార్డు ఇండిపెండెంట్‌ అభ్యర్థి మాసిపోగుల స్వర్ణలత నామినేషన్‌ పత్రంపై ప్రపోజర్‌గా ఒకే వ్యక్తి సంతకం చేయడంతో తిరస్కరించినట్టు చెప్పారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి కోసం దాఖలైన నాలుగు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయ న్నారు. 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందన్నారు.  

ఇదీ చతవండి: జనసేనకు కీలక నేత గుడ్‌బై

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement