జనసేనకు కీలక నేత గుడ్‌బై | Kye Leader Resignation To Jana Sena Party | Sakshi
Sakshi News home page

జనసేనకు కీలక నేత గుడ్‌బై

Oct 20 2026 9:11 AM | Updated on Oct 20 2026 9:13 AM

Kye Leader Resignation To Jana Sena Party

సాక్షి, కాకినాడ:  స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి కీలక వికెట్‌ పడింది. తమ కంచుకోట అని ఆ పార్టీ చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేన విజయానికి విశేష కృషి చేసిన సీనియర్‌ నాయకుడు ఆరేటి మురళీకృష్ణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు.

ఈ మేరకు పార్టీ మలికిపురం మండల అధ్యక్షుడు మల్లిపూడి సత్తిబాబుకు తెలిపానని పేర్కొన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని తన ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మురళి ఈ విషయం తెలిపారు. జనసేన అభివృద్ధికి 2009 నుంచీ అహర్నిశలూ పని చేశామని, ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు తనకు నచ్చడం లేదని అన్నారు. జనసేన నిర్ణయాలు కూడా సరైనవి కాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement