సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి కుట్రలు, అరాచకాలు పతాక స్థాయికి చేరాయని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కడప వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిని దీప్తి రెడ్డిని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్లు సురేష్ బాబు, పాక సురేష్ పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఆమె ఇంటిని పరిశీలించారు.
అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ప్లాన్డ్‌గా హింసకు పాల్పడుతున్నారు.. నారా లోకేష్ డైరెక్షన్‌లో హింసకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఏనాడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులు చూడలేదు. ఎన్నికలకు ముందు నుంచే రెడ్‌బుక్ అమలు చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళా హోం మంత్రి, స్థానికంగా ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి దాడులేంటని అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పారు. ఇలాంటి దాడులతో తనను భయపెట్టలేరన్న మేయర్ అభ్యర్థి బండి దీప్తి.. కడపలో ఏనాడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. కడపలో పరిస్థితులను ప్రతి ఒక్కరూ గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఎదురుదెబ్బ


