సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతిలో విద్యార్థులను సర్వనాశనం చేసేందుకు టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నట్టుంది. వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రలోభపెట్టే ప్రయత్నం ముమ్మరం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వానికి టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రతిపక్షాల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే మందిమార్బలాన్ని సన్నద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎస్వీయూలో పీజీ చేస్తున్న విద్యార్థులను బలిపుశువులను చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పారీ్టకి చెందిన చోటా నాయకులు విద్యార్థులకు ఫోన్ చేసి రోజు రూ.600 కూలి ఇస్తాం.. బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేస్తామంటూ ఆశ చూపుతున్నారు. కేవలం నామినేషన్ వేసే కేంద్రాల వద్ద వేచి ఉండడమే పని అని ప్రలోభపెడుతున్నారు.
దారుణం
అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు డబ్బులు ఆశ చూపి నామినేషన్ ప్రక్రియను అడ్డుకోనే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. వర్సిటీలో పలువురు విద్యార్థులకు అధికార పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేయడంతో ఎస్‌ఎఫ్‌ఐ దృష్టికి వారు తీసుకురావడం జరిగిందన్నారు.
చదవండి: ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు


