ఏపీలో జంగిల్‌ రాజ్‌.. అడ్డదారులు.. అరాచకాలు | AP Local Body Elections: Chandrababu Govt Anarchy October 20 Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో జంగిల్‌ రాజ్‌.. అడ్డదారులు.. అరాచకాలు

Oct 20 2026 8:38 AM | Updated on Oct 20 2026 9:26 AM

AP Local Body Elections: Chandrababu Govt Anarchy October 20 Updates

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎ­ల్లో గూండాలు దాడులకు దిగుతున్నారు. ఇళ్లపై దాడులు, వాహనాల ధ్వంసంతో పేట్రే­గి­పోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. రేపటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు  వేయకుండా ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌  చేస్తున్నారు.

 Updates:

రేపు సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై విచారణ

  • విచారణ జరుపనున్న జస్టిస్  జాయ్మాల్య భాగ్చి, జస్టిస్ మోహన ధర్మాసనం
  • మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్లు అడ్డుకోవడంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
  • ఏపీ హై కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీ
  • ఇటీవల పంజాబ్‌లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో  50 వార్డులలో ఎన్నికలు రద్దు చేసి.. రీ పోలింగ్‌కి ఆదేశించిన సుప్రీం
  • అర్బన్ లోకల్ బాడీల్లో నామినేషన్ దాఖలు చేసే గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని  కోరుతూ పిటిషన్
  • ఏకగ్రీవ ఎన్నిక పై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో వినతి
     

నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి సర్కార్‌ కుట్రలు

  • ఓటమి భయంతో 12 మంది చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు ఏకపక్షంగా తిరస్కరణ

  • మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోటీలో 14 నామినేషన్లు దాఖలు

  • వైఎస్సార్‌సీపీ నుంచి దాఖలు చేసిన నామినేషన్లు స్క్రూట్నీలో ఆమోదం తెలిపి.. చివరి నిమిషంలో తిరస్కరించినట్లు ప్రకటన

  • హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఆర్కే రోజా

  • ఎన్నికల అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేని అధికారులు

  • నగరి మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డుల్లో కౌన్సిలర్లు బరిలో 283 నామినేషన్లు దాఖలు, 5 నామినేషన్లు తిరస్కరణ. 278 నామినేషన్లు ఆమోదం

పులివెందులలో అక్రమ అరెస్ట్‌లు

  • పులివెందుల నియోజకవర్గంలో అర్ధరాత్రి పోలీసుల అక్రమ అరెస్టులు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలను భయపెడుతున్న పోలీసులు

  • చక్రాయిపేట  పేట మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు

కడప వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిని బండి దీప్తి ఇంటిపై దాడి

  • అర్ధరాత్రి బీరు బాటిళ్లతో ఇంటిపై దాడికి దిగిన పచ్చ మూకలు
  • వాహనంలో వచ్చి వేటకొడవల్లు బీరు బాటిళ్లు ఇంట్లోకి విసిరిన మూకలు
  • ఇంటి అద్దాలు ధ్వంసం..
  • భద్రత కల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేసిన వైనం
  • అర్ధరాత్రి ఇలా దాడులకు దిగడంపై మండిపడ్డ దీప్తి
  • దీప్తి నామినేషన్ ఆమోదం కావడంతో తట్టుకోలేక పచ్చ మూకల దాష్టీకం

దాడులు.. చించివేతలు

  • నామినేషన్లకు ముందు, ఆ తర్వాత టీడీపీ మూక యథేచ్ఛగా దాడులు.. చించివేతలు
  • చివరకు నామినేషన్ల పరిశీలనలోనూ అదే దౌర్జన్యం, అదే అన్యాయం
  • 8 చోట్ల నామినేషన్లకే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గం
  • మరో 11 చోట్ల సగం కంటే తక్కువగా అవకాశం.. ఏకపక్షంగా గెలుచుకునేలా కుట్ర
  • ఇప్పుడు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ దాడులు, విధ్వంసం
  • కుప్పంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కిడ్నాప్‌
  • ఎమ్మెల్సీ భరత్‌ ఇంటిపై దాడి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తీవ్ర గాయాలు
  • ప్రొద్దుటూరులో చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు చింపివేత
  • మహిళ చీర కొంగు లాగేసి నామినేషన్‌ పత్రాలు లాక్కున్న టీడీపీ గూండాలు  
  • స్రూ్కటినీకి వెళ్తున్న అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా రౌడీయిజం
  • డోన్‌లో కోట్ల సుజాతమ్మ, నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి హల్‌చల్‌
  • ఆళ్లగడ్డలో ఏకపక్షంగా నామినేషన్ల పరిశీలన  
  • రాజంపేటలో తొలుత నామినేషన్‌ ఆమోదం.. ఆ తర్వాత తిరస్కరణ
  • చిత్తూరులో 30 మంది అభ్యర్థులకు ఫారం7 ఇవ్వని వైనం
  • నగరిలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ
  • అడుగడుగునా అధికార దుర్వీనియోగం.. ప్రజాస్వామ్యంలో దుర్దినం  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement