సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్ధరాత్రి పచ్చమూకలు రెచ్చిపోయారు. కడప వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి ఇంటిపై పచ్చ టీడీపీ గూండాలు దాడికి దిగారు. అధికార పక్షానికి బండిదీప్తి కంటగింపుగా మారింది. పైగా మేయర్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఆమోదం లభించింది. దీంతో మేయర్ స్థానానికి పోటీ అనివార్యం కానుంది.
ఈ నేపథ్యంలో ఎలాగైనా పోటీ నుంచి విరమించాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. భద్రత కల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. టీడీపీ గూండాల దాడులపై దీప్తి మండిపడ్డారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేయాలని చూస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు.
మేయర్ బరిలో 18 మంది అభ్యర్థులు
కడప నగరపాలక సంస్థ మేయర్ బరిలో 18 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక డివిజన్ కార్పొరేటర్లకు సంబంధించి 147 నామినేషన్లు దాఖలు కాగా 57 తిరస్కరణకు గురయ్యాయి. 90 నామినేషన్లను ఆమోదించారు. ఇందులో బీజేపీ–5, టీడీపీ–74, వైఎస్సార్‌సీపీ–3,జనసేన–5, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు.
ఇదీ చదవండి: పులివెందులలో ఖాకీ కుట్ర!


