breaking news
Mayor candidate
-
విమర్శల జడివానలో మమ్దానీ
అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నా గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న మమ్దానీ వైఖరిపై ఇప్పుడు న్యూయార్క్ నగరవ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరితో వార్తల్లోనేకాదు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లోనూ నిలిచి డెమొక్రటిక్ అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీని భారత్‌లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైనా మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తరచూ అబద్దాలు వల్లెవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలూ పెరిగాయి. మొదట్నుంచీ అతి వాగ్దానాలు డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న వెంటనే మమ్దానీని ‘నెరవేరని వాగ్దానాలుచేసే నేత’గా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ‘‘ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చు అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యం అని తెల్సికూడా ఇష్టమొచి్చన హామీలిస్తాడు’’అని ఎరిక్ ఆరోపించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మమ్దానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞచేశారు. ‘‘అపార్ట్మెంట్లలో అద్దెలను క్రమబద్దీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశుసంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరకు దుకాణాలు తెరుస్తానన్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా 10 బిలియర్ డాలర్లు ఖర్చువుతుందని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కు పిండిమరీ వసూలుచేస్తానన్నాడు. అయితే నగరంలో పన్నులు వసూలుచేసే అధికారం మేయర్‌కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు’’అని ఆడమ్స్ గుర్తుచేశారు. మమ్దానీ ప్రస్తుతం క్వీన్స్ 36వ జిల్లా నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పాలస్తీనాకు జై.. నెతన్యాహూకు నై పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ సేనల భీకర దాడులను ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు ఆదేశించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధనేరాలకు పాల్పడిన నేరస్తుడిగా మమ్దానీ అభివరి్ణంచారు. ‘‘యుద్దనేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహూపై 2024 నవంబర్లోనే అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అతను న్యూయార్క్‌కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా’’అని మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీపైనా విమర్శలు గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికను పంచుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మమ్దానీ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘‘నెతన్యాహూ మాదిరే మోదీ కూడా యుద్దనేరస్తుడే. గుజరాత్లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమే. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామ ని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు’’ అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలూ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. ‘‘మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్‌లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్‌పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్ నుంచి ఊహాత్మక అబద్దాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. నగరంలో మమ్దానీకి మద్దతుదారులు పెరిగితే చివరకు ‘జిహాదీ మేయర్’అవతరిస్తాడు అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మమ్దానీని విమర్శించే వాళ్లు అతని తల్లిదండ్రులపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘మమ్దానీ తండ్రి అసలైన మార్కిస్ట్కాదు. నిఖార్సయిన వ్యక్తికాదు. ఇక అతని తల్లి మీరా నాయర్ అసలైన కేరళ మలయాళీ నాయర్ కాదు. ఆమె పేరులో అక్షరదోషం ఉంది. ఆ పేరు నాయర్ కాదు పంజాబీ నయ్యర్. మమ్దానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని హిందువులన్నీ, యూదులన్నీ అస్సలు పడదు. వీళ్లపై జరిగే దాడులను సమర్థిస్తాడు’’అని మరో నెటిజన్ విమర్శించాడు. హిందూ వ్యతిరేకి? 2020 ఆగస్ట్‌లో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్ట్‌లు పెట్టారు. ‘‘భారత్‌లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే, ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధతో గుజరాతీలో భజనలు చేశారు. ఇలాంటి ఘన చరితను బీజేపీ తుడిచిపారేస్తోంది’’అని మమ్దానీ గతంలో ఒక ట్వీట్‌చేశారు. ‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్‌లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్ పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్ పెట్టారు. ఆధునిక నాగరికతకు నిలయమైన న్యూయార్క్‌కు అవకాశమొస్తే మేయర్‌గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్షధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్‌వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మీరు భారతీయుడిలా కాదు.. పాకిస్తానీలా కనిపిస్తున్నారు: కంగనా
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారత్‌లో పుట్టి పెరిగారు. గుజరాత్‌కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025 కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. -
పూర్తిగా కమ్యూనిస్ట్ పిచ్చోడు
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో విజయం సాధించిన భారత సంతతి ముస్లిం నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. మమ్దానీ అసలు సిసలైన కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో గురువారం మమ్దానీని విమర్శిస్తూ పలు పోస్ట్లుపెట్టారు. ‘‘ చివరకు జరగకూడనిదే జరిగింది. డెమొక్రాట్లు హద్దు మీరారు. పూర్తిగా కమ్యూనిస్ట్ పిచ్చోడైన జోహ్రాన్ మమ్దానీని ప్రైమరీ ఎన్నికల్లో గెలిపించారు. చూడబోతే ఆయనే నగర కొత్త మేయర్ అయ్యేలా ఉన్నారు. గతంలోనూ న్యూయార్క్ పీఠంపై విప్లవకారులు కూర్చున్నారు. కానీ ఈసారి మమ్దానీ ఎన్నిక హాస్యాస్పదంగా ఉంది. మమ్దానీ గత ర్యాడికల్ నేతలకంటే కూడా విపరీత పోకడలో పయనిస్తున్నాడు. అతను అంత తెలివైనవాడు కాదు. సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలు, వాతా వరణ మార్పులపై ఇతనికి బొత్తిగా అవగాహన లేద నుకుంటా. దమ్ము లేని నేతలంతా కలిసి ఇతడికి మద్దతు పలికారు. గొప్ప యూద సెనేటర్ చుక్ షెమెర్, కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో–కోర్టెజ్ సైతం మమ్దానీపై ప్రశంసల వర్షం కురిపించడం వింతగా ఉంది. మమ్దానీ లాంటి వ్యక్తులను గెలిపించడం చూస్తుంటే మన దేశం నిజంగా తప్పుదారిలో వెళ్తోందని స్పష్టమవుతోంది’’ అని ట్రంప్ వ్యాఖ్యా నించారు. ఎలాగూ తెలివి తక్కువ వాళ్లే గెలుస్తు న్నారు గనుక తక్కువ ఐక్యూ ఉన్న అభ్యర్థులనే డెమొక్రాట్లు ఏ ఎన్నికలకైనా నామినేట్ చేయాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా 33 ఏళ్ల భారత సంతతి వ్యక్తి
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ (New York Mayor) అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. న్యూయార్క్‌లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోరులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) గెలుపొందారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా జోహ్రాన్ మమదానీ గెలుపొందారు. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. ఇంతకు ముందు.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో జోహ్రాన్ మమదానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ జోహ్రాన్ మేయర్‌గా ఎన్నికైతే.. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.మేయర్ ఎన్నిక ప్రధాన అభ్యర్థులు(ఇప్పటివరకు)జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) – డెమోక్రటిక్ సోషలిస్ట్, డెమోక్రటిక్ ప్రైమరీలో విజయంకర్టిస్ స్లివా (Curtis Sliwa) – రిపబ్లికన్ అభ్యర్థిజిమ్ వాల్డెన్ (Jim Walden) – స్వతంత్ర అభ్యర్థిఎరిక్ అడమ్స్ – ప్రస్తుత మేయర్, స్వతంత్ర అభ్యర్థిజోహ్రాన్ మమదానీ గురించి.. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025 -
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో తీవ్ర తకరారు నెలకొంది. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుపడుతుండగా ఆయన వ్యతిరేకవర్గం అడ్డుతగులుతోంది. గుంటూరు మేయర్ అభ్యరి్థగా అక్కడి పశి్చమ నియోజకవర్గ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని)ను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ మేయర్ అభ్యర్థులుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎలా ఖరారు చేస్తారనే ప్రశ్నను కేశినేని వ్యతిరేకవర్గం లేవనెత్తుతోంది. కోవెలమూడి, కేశినేనిలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. బాబు వ్యూహంతోనే శ్వేతకు చెక్ కేశినేని శ్వేతకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకూడదనే చంద్రబాబు ముందస్తు వ్యూహం పన్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం పార్టీ ప్రధాన కార్యా లయంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు గుంటూరు, విజయవాడ ముఖ్య నాయకులతో మాట్లాడారు. కోవెలమూడి రవీంద్రను గుంటూరు మేయర్ అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించారు. కేశినేని నానీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులతోనూ చర్చించిన అచ్చెన్నాయుడు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారే తప్ప శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోవడమే ట్విస్ట్. ఇటీవలి కాలంలో కేశినేని స్వరం అధిష్టానాన్ని ధిక్కరించే రీతిలో ఉంటోందని చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. విజయవాడకు తానే అధిష్టానమని, తనకు ఎవరూ హైకమండ్ లేరని, 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పినప్పుడు లేని తప్పులు 39వ డివిజన్ అభ్యర్థిగా శివశర్మను చేస్తే ఎందుకు వస్తాయి, ఓడిపోయిన వారు మాట్లాడేది ఏంటి, వారి మాట వినే పరిస్థితి లేదనే బహిరంగ వ్యాఖ్యానాలు చేయడాన్ని బాబు దృష్టికి వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి లోకేష్‌నుద్దేశించి నాని అభిప్రాయాలు కూడా చంద్రబాబు చెవిన వేశారనేది వినికిడి. శ్వేత మేయర్‌గా తను చెప్పలేదని, ఎంపీ స్వయం ప్రకటితమని బాబు గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు బుద్దా, మీరాలకు తోడు దేవినేని ఉమ, బొండా ఉమ, వర్ల రామయ్య, పట్టాభి కూటమి కేశినేనికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యమే. సామాజిక వర్గం సాకుగా... కేశినేని వ్యతిరేక కూటమి మాటలకు ప్రాధాన్యమివ్వడం, కేశినేనికి చెక్ పెట్టడంలో భాగంగానే కోవెలమూడి పేరు వెలువడింది. తద్వారా రాజధాని ప్రాంతంలోని రెండు కార్పొరేషన్లలో ఒకే సామాజిక వర్గానికి మేయర్ పదవులా అనే వివాదానికి తెరతీసేందుకు వీలవుతోంది. దీన్నే సాకుగా చూపి శ్వేతకు చెక్ పెట్టవచ్చనేది బాబు ఎత్తుగడగని స్వపక్షీయులే అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా కోవెలమూడి నానికి గుంటూరు నగరంలో ఉన్నంత వ్యతిరేకత మరెవరికీ లేదు. అవినీతి ఆరోపణలు, మోసాలు లెక్కకుమిక్కిలి ఉన్నాయని మేయర్‌గా పేరు ప్రకటించవద్దని సీనియర్లు అధిష్టానానికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నానికి చెక్ పెట్టాలంటే కోవెలమూడి పేరును ప్రకటించాలని అచ్చెన్నకు బాబు సూచించి కుప్పంకు బయలుదేరినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బుద్ధా హైదరాబాద్‌కు... చంద్రబాబుకు నమ్మిన బంటునని చెప్పుకునే బుద్ధా వెంకన్న గురువారం అచ్చెన్నతో మీటింగ్ కాగానే కుమారుడు బుద్ధా వరుణ్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కూతురు పూజితకు కాకుండా కేశినేని బలపరిచిన శివశర్మకే 39వ డివిజన్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందునే బుద్ధా వెళ్లారంటున్నారు. నాయకుల అలక తీర్చే సాకుతో శ్వేత పేరును ప్రకటించకుండా వాయిదా వేయడానికి బాబు కోటరి వేసిన మరో ఎత్తుగడగా కేశినేని వర్గం భావిస్తోంది. -
అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్
ఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ మిగతా వారికంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ గుల్షన్ బిందు పేరును సమాజ్ వాదీ పార్టీ ఖరారు చేసింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో తమ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా గుల్షన్ పేర్కొన్నారు. హామీలు అమలు చేయలేని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె తెలిపారు. వచ్చే నెల 21, 22, 29 తేదీల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలను డిసెంబర్ ఒకటో తేదీన ప్రకటిస్తారు. కాగా మీరట్- దీప్ మనేతియా వల్మీకిని, బరైలీ- ఐఎస్ తోమర్‌ను, అలీగఢ్- ముజాహిద్ కిద్వాయి, ఝాన్సీ- రాహుల్ సక్సేనాను, గోరఖ్‌పూర్- రాహుల్ గుప్తాను, మొరాదాబాద్- యూసఫ్ అన్సారీని అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది. -
మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్
-
మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్
ఈ నెల 29, 30న ప్రచారానికి దిగ్విజయ్, ఆజాద్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ఎం.విక్రమ్ గౌడ్‌ను టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది. పార్టీలోని సీనియర్లతో చర్చించి, అందరి ఆమోదం తీసుకుని విక్రమ్‌ను నిర్ణయించినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, యువకుడు అయిన విక్రమ్‌ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించామన్నారు. పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్రంలో అనుభవజ్జులైన నాయకులు గ్రేటర్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 29న, కేంద్ర మాజీమంత్రి గులాంనబీ ఆజాద్ 30న హైదరాబాద్‌లో ప్రచారంచేస్తారని వివరించారు. పాతబస్తీలో నిర్వహించే బహిరంగసభల్లో వారు ప్రసంగిస్తారని తెలిపారు. దీనితోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం, సమన్వయం చేయడానికి అనుభవజ్ఞులతో ప్రచార కమిటీని ఏర్పాటుచేసినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు చైర్మన్‌గా ప్రచార కమిటీ ఏర్పాటైందన్నారు. పార్టీ సీనియర్లు సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య, ఎం.ఏ.ఖాన్, రేణుకా చౌదరి, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎం.శశిధర్ రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, పి.సుధాకర్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించారు. -
ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు?
► కౌన్ హై..మేయర్ ► ముందే పావులు కదిపిన కాంగ్రెస్ ► మేయర్ అభ్యర్థిగా ముఖేష్ తనయుడు విక్రంగౌడ్ ► టీఆర్ఎస్ జాబితాలో విజయలక్ష్మీ, రాంమోహన్,జగదీశ్వర్‌గౌడ్ ► ఎంఐఎం పరిశీలనలో మాజిద్,నవీన్‌యాదవ్ హైదరాబాద్ సిటీబ్యూరో--- ఏ పార్టీ గెలిస్తే..ఎవరు మేయర్ అవుతారు..డిప్యుటీ మేయర్ అవుతారు..అన్న చర్చ నగరంలో ఊపందుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రకు భిన్నంగా ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు జాంభాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూల విక్రంగౌడ్‌ను ప్రకటించింది. దీంతో మిగిలిన అన్ని ప్రధాన పార్టీల్లో చర్చ పలువురు అభ్యర్థుల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో మరో బలమైన అభ్యర్థి లేకుండా పోవటంతో గోషామహల్ నియోకజవర్గానికి చెందిన విక్రంను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో సైతం మేయర్ అభ్యర్థులెవరన్న పరిశీలన మొదలైంది. బంజారాహిల్స్ డివిజన్ నుండి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ,చర్లపల్లి స్థానం నుండి పోటీ చేస్తునన బొంతు రాంమోహన్,మాదాపూర్ డివిజన్ నుండి పోటీచేస్తున్న జగదీశ్వర్గౌడ్ల చుట్టూ చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరిన జగదీశ్వర్‌గౌడ్‌కు టీఆర్ఎస్ మదాపూర్ నుండి, ఆయన భార్య పూజిత హఫీజ్‌పేట కార్పోరేటర్లుగా పోటీ చేస్తున్నారు.అయితే టీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపించటం లేదు. మేయర్ ఎన్నిక రోజే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని నగరానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఎంఐఎం జాబితాలో మాజిద్,నవీన్ యాదవ్ ఎంఐఎం జాబితాలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, జూబ్లిహిల్స్ నియోజక వర్గ నాయకుడు నవీన్యాదవ్ల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం డివిజన్ నుండి.నవీన్ యాదవ్ రహమత్‌నగర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నారు. అయితే 60 స్థానాలకే పోటీ చేస్తున్న ఎంఐఎం కూడా ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపించటం లేదు. ఎంఐఎం గెలుచుకునే స్థానాలకు తోడు, తమ సహాయం అవసరమైన పార్టీలు ముందుకొచ్చిన తర్వాత మేయర్,డిప్యుటీ మేయర్ పదవులపై చర్చించాలని భావిస్తోంది. తమ మద్దతు కీలకమైతే మేయర్ స్థానాన్ని కోరుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.ఇక తెలుగుదేశం,బీజేపీల్లో ఇంకా మేయర్ ఊసే కనిపించటం లేదు. -
హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 29న దిగ్విజయ్ సింగ్, 30న గులాం నబీ ఆజాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్ నేతలతో మాట్లాడి ఎన్నికల ప్రచార వ్యూహం ఖరారు చేస్తామని విక్రమ్ గౌడ్ చెప్పారు. మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉందన్న విషయం స్పష్టమైందని అన్నారు. -
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా అజారుద్దీన్?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే అజార్‌ను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. సెలబ్రిటీ హోదాతో పాటు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో అజార్‌కు నగర యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం దూరం కావటం, అధికార టీఆర్ఎస్ పలు కార్యక్రమాలతో దూకుడు పెంచటంతో కాంగ్రెస్ పార్టీ సైతం తన వ్యూహాలకు పదును పెట్టింది. ఒక వైపు ఎంఐఎంకు చెక్పెట్టటంతో పాటు, టీఆర్ఎస్ దూకుడును తగ్గించవచ్చన్న ఆలోచనతో మేయర్ అభ్యర్థి ప్రతిపాదనను పీసీసీ అజారుద్దీన్ ముందుంచినట్లు సమాచారం. అయితే, తన నిర్ణయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని, సమయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఒకవేళ అజార్ ముందుకురాకపోతే మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రంగౌడ్తోపాటు మరికొందరు పేర్లను పరిశీలించాలని పీసీసీ నేతలు భావిస్తున్నారు. -
టీడీపీ మేయర్ అభ్యర్థి అరెస్టు
తెలుగుదేశం పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి హత్యకేసులో బాలకృష్ణ యాదవ్ మూడో నిందితునిగా ఉన్నారు. ఇన్నాళ్లుగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి పద్మావతి
మూడు రోజుల్లో మేయర్ అభ్యర్థి ఎంపిక పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను వెల్లడి సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ పాలకమండలి సభ్యురాలు తాతినేని పద్మావతి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదివారం ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య నేతలతో కలసి ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న పద్మావతిని అందరి ఆమోదంతో ఎంపిక చేశామని వివరించారు. జిల్లాలోని 49 మండలాల నేతలు, 13 మంది సమన్వయకర్తలతో చర్చించి అందరి అభిప్రాయంతో పద్మావతిని జెడ్పీ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా నిలిపామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు నెలకు సగటున 26 రోజులు ప్రజల మధ్యే ఉంటూ పర్యటనలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజావిశ్వాసం పొందిన తమ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీచేస్తుందని, జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నామని వివరించారు. అన్ని ఎన్నికల్లో అత్యధిక స్థానాలు... జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థ, 49 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని భాను స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో తేలక ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గన్నవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఎంపీ, బందరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే డైలమా ఆ పార్టీలో ఉందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఖాళీ అవుతోందని చెప్పారు. అనంతపురంలో పరిటాల సునీత, విశాఖలో అయ్యన్నపాత్రుడు, గుంటూరులో కోడెల వంటి నేతలు చంద్రబాబుపై విశ్వాసం కోల్పోయి అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం కట్టుబడినవారికే ప్రాధాన్యం... మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి వస్తున్నారని భాను చెప్పారు. ‘మా పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయింది.. మీ పార్టీలో మాకు చోటు కల్పించండి’ అంటూ పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నేతలు వస్తున్నా పార్టీ కోసం కట్టుబడి పనిచేసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అసమర్థ ప్రభుత్వ వల్లే ఆలస్యంగా స్థానిక ఎన్నికలు... పార్టీ జిల్లా పరిశీలకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసమర్థ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. దీనివల్ల వేలకోట్ల కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్రం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన తాతినేని పద్మావతి దివంగత వైఎస్సార్‌పై అభిమానంతో ఏడాది పదవీకాలాన్ని వదులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. మరో మూడు రోజుల్లో విజయవాడ నగర మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. నేతలతో చర్చించి ఖరారు చేసుకుని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అనుమతితో అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు. ఒంటరిగానే పోటీ... తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఉమ్మారెడ్డి చెప్పారు. పొత్తులు పెట్టుకొని పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరులో ఎంపీటీసీగా, జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విశేష అనుభవం ఉన్న పద్మావతిని చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయటం మంచి పరిణామన్నారు. పార్టీలో ఒక సామాజిక వర్గానికే పెద్దపీట అని కొందరు విమర్శించటం అర్థరహితమన్నారు. తనను సమన్వయకర్తగా నియమించారని, కొద్దిరోజుల్లోనే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కుక్కల విద్యాసాగర్ మాట్లాడుతూ నిజాయతీ, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని కొనియాడారు. ఇచ్చిన హామీని తూచ తప్పకుండా అమలుచేస్తూ కార్యకర్తలకు న్యాయం చేస్తోందన్నారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మొదటినుంచీ పార్టీలోనే ఉండి నిబద్ధత కలిగిన పద్మావతిని ఎంపిక చేయటం హర్షణీయమని చెప్పారు. జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. నాడు వైఎస్సార్.. నేడు జగన్... చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి మాట్లాడుతూ నాడు జెడ్పీ వైస్‌చైర్మన్‌గా తనను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీర్వదిస్తే.. నేడు వైఎస్ జగన్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ఆశీర్వదించారని చెప్పారు. 16 మంది కన్వీనర్లు, 49 మంది మండల అధ్యక్షుల ఏకగ్రీవ ఆమోదంతో తనను ఎంపిక చేశారని వివరించారు. సామాజిక న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. విలేకర్ల సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు రక్షణనిధి (తిరువూరు), పడమట సురేష్‌బాబు (పెనమలూరు), ఎం.జగన్మోహనరావు (నందిగామ), నేతలు రమేష్, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరలు పాల్గొన్నారు. తాతినేని ఎంపిక అభినందనీయం : పేర్ని నాని వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని ఎంపిక చేయటం అభినందనీయమని ఆ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని కొనియాడారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న ఆమెకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిగా మహిళను ప్రకటించటం మంచి పరిణామమన్నారు. -
ఎవరికి వారే..
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థి వివాదం నాలుగు స్తంభాలాటగా మారింది. ఎంతైనా ఓకే అంటూ పార్టీకి చెందిన నలుగురు ముఖ్యులు బరిలోకి దిగడంతో పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. మేయర్ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలో తేల్చుకోవవడానికి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు పలువురు ముఖ్య నేతలు రాజధాని బాటపట్టారు. మేయర్ అభ్యర్థిగా తమ మద్దతు దారుడినే ఎంపిక చేసుకుని పార్టీ మీద పట్టు సాధించడానికి ఇటీవలే టీడీపీలో చేరిన నేతలతో పాటు, సీనియర్లు సైతం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన మనిషిగా జెడ్.శివప్రసాద్‌ను రంగంలోకి దించారు. ఈనెల 5వ తేదీ పార్టీలో చేరిన శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి నగర పార్టీని తన చేతుల్లో ఉంచుకోవాలనే తలంపుతో కిన్నెర ప్రసాద్‌ను పోటీకి దించారు. మరో శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి నూనెమల్లికార్జున యాదవ్‌ను, నగర కమిటీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ మనిషి సతీష్ యాదవ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకోవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ గ్రూపుల ఆధారంగానే ఒకరినొకరు దెబ్బతీసుకునేలా కార్పొరేటర్ టికెట్ల కేటాయింపునకు కుస్తీలు పడుతున్నారు. తొలివిడతగా ప్రకటించిన 28 మంది అభ్యర్థుల జాబితాతో పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. మిగిలిన డివిజన్ల అభ్యర్థుల ఎంపికలో కూడా తమదే పైచేయి చేసుకోవాలని ఎవరికి వారు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతూ ప్రత్యర్థుల తరఫున మేయర్ రేసులోకి రాగలరని భావిస్తున్న వారికి టికెట్ ఎగరగొట్టే ప్రయత్నాల్లో పడ్డారు. డబ్బే కావాలంటే తాను ‘టెన్ సి’ ఇవ్వడానికి సిద్ధమని ఒక నాయకుడు మాగుంట లేఔట్‌లోని స్థలాన్ని విక్రయించారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయిలో ఈ పంచాయితీ తేలే పరిస్థితి కనిపించకపోవడంతో జిల్లా అధ్యక్షుడు రవిచంద్రతో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్‌కు బయల్దేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి ఆ నలుగురిలో మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చాలని కోరనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల తర్వాత మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని కొందరు నేతలు అధిష్టానవర్గానికి సూచిస్తున్నారు. మేయర్‌ను ఎంపిక చేయకపోతే కార్పొరేట్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఎ వరు సమకూర్చాలనే వాదన మరికొందరు లెవనెత్తుతున్నారు . డివిజన్లలో రెబెల్స్‌ను చల్లబరచుకోవడానికి కూడా మేయర్ అభ్యర్థి ఎంపిక అవసరమని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇన్ని వాదనలు, వివాదాల మధ్యన చంద్రబాబు మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.