
న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీపై ట్రంప్ విమర్శలు
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో విజయం సాధించిన భారత సంతతి ముస్లిం నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. మమ్దానీ అసలు సిసలైన కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో గురువారం మమ్దానీని విమర్శిస్తూ పలు పోస్ట్‌లుపెట్టారు. ‘‘ చివరకు జరగకూడనిదే జరిగింది. డెమొక్రాట్లు హద్దు మీరారు. పూర్తిగా కమ్యూనిస్ట్ పిచ్చోడైన జోహ్రాన్ మమ్దానీని ప్రైమరీ ఎన్నికల్లో గెలిపించారు. చూడబోతే ఆయనే నగర కొత్త మేయర్ అయ్యేలా ఉన్నారు.
గతంలోనూ న్యూయార్క్ పీఠంపై విప్లవకారులు కూర్చున్నారు. కానీ ఈసారి మమ్దానీ ఎన్నిక హాస్యాస్పదంగా ఉంది. మమ్దానీ గత ర్యాడికల్ నేతలకంటే కూడా విపరీత పోకడలో పయనిస్తున్నాడు. అతను అంత తెలివైనవాడు కాదు. సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలు, వాతా వరణ మార్పులపై ఇతనికి బొత్తిగా అవగాహన లేద నుకుంటా. దమ్ము లేని నేతలంతా కలిసి ఇతడికి మద్దతు పలికారు.
గొప్ప యూద సెనేటర్ చుక్ షెమెర్, కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో–కోర్టెజ్ సైతం మమ్దానీపై ప్రశంసల వర్షం కురిపించడం వింతగా ఉంది. మమ్దానీ లాంటి వ్యక్తులను గెలిపించడం చూస్తుంటే మన దేశం నిజంగా తప్పుదారిలో వెళ్తోందని స్పష్టమవుతోంది’’ అని ట్రంప్ వ్యాఖ్యా నించారు. ఎలాగూ తెలివి తక్కువ వాళ్లే గెలుస్తు న్నారు గనుక తక్కువ ఐక్యూ ఉన్న అభ్యర్థులనే డెమొక్రాట్లు ఏ ఎన్నికలకైనా నామినేట్ చేయాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.