గ్రహంతర వాసులపై.. ఒబామా సంచలన కామెంట్స్ | Obama's comments on Aliens | Sakshi
Sakshi News home page

గ్రహంతర వాసులపై.. ఒబామా సంచలన కామెంట్స్

Feb 15 2026 9:25 PM | Updated on Feb 16 2026 8:56 AM

Obama's comments on Aliens

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో గ్రహాంతర వాసులపై తన అభిప్రాయం పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతానన్నారు. అయితే వారు ఎక్కడున్నారనేది మాత్రం తనకు తెలియదన్నారు.

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రముఖ యూట్యూబర్ బ్రియాన్‌ టైలర్ కోవెన్ పాడ్‌కాస్ట్ విడుదలైంది. అందులో ఏలియన్స్ గురించి కీలక సమాచారాన్ని ఒబామా పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతారన్నారు. ఆయన మాట్లాడుతూ" గ్రహాంతర వాసులు ఉండడం నిజం. అయితే వారి ఉనికి నాకు తెలియదు. వారిని ఏరియా 51లో ఉంచలేదు. అక్కడ భూగర్భ సౌకర్యం లేదు. ‍అయితే ఏదైనా కుట్ర జరిగి అమెరికా అధ్యక్షుడికే తెలియకుండా దాడిపెడితే అది వేరే విషయం" అన్నారు.

ఏరియా 51 అనేది నెవాడాలోని గ్రూమ్ లేక్‌లో ఉన్న అత్యంత రహస్యమైన US వైమానిక దళ స్థావరం, ఇది చాలా కాలంగా ప్రభుత్వం గ్రహాంతర వాసుల  సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా అవశేషాలను దాచిపెడుతుందనే ఊహాగానాలు రేగుతున్నాయి. అయితే  ఒబామా UFOలు మరియు గ్రహాంతర జీవుల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ "గ్రహాంతరవాసుల విషయానికి వస్తే, నేను మీకు ప్రసారంలో చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి" అని ఒబామా అనడం అప్పట్లో సంచలనం రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement