హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్ | congress announced vikram goud as GHMC mayor candidate | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్

Jan 25 2016 5:40 PM | Updated on Mar 18 2019 7:55 PM

హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్ - Sakshi

హైదరాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 29న దిగ్విజయ్ సింగ్, 30న గులాం నబీ ఆజాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

సీనియర్ నేతలతో మాట్లాడి ఎన్నికల ప్రచార వ్యూహం ఖరారు చేస్తామని విక్రమ్ గౌడ్ చెప్పారు. మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉందన్న విషయం స్పష్టమైందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement