వేరే వాళ్లను నామినేషన్‌ వేయనిచ్చే ప్రసక్తే లేదు | Controversial Comments On TDP Leader Bommireddypalle Subbarayudu | Sakshi
Sakshi News home page

వేరే వాళ్లను నామినేషన్‌ వేయనిచ్చే ప్రసక్తే లేదు

Oct 20 2026 8:16 AM | Updated on Oct 20 2026 8:16 AM

Controversial Comments On TDP Leader Bommireddypalle Subbarayudu

కర్నూలు జిల్లా: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లను కాదని వేరే వాళ్లను నామినేషన్‌ వేయనిచ్చే ప్రసక్తే లేదని టీడీపీ నేత బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో టీడీపీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఎంపీపీ, జెడ్పీటీసీ, కొన్ని ఎంపీటీసీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఉండగానే బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు మాట్లాడుతూ..  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వేరే వాళ్లు నామినేషన్‌ వేసేందుకు వస్తే అడ్డుకునేందుకు ప్రతి గ్రామం నుంచి వచ్చి ఎంపీడీవో ఆఫీసు వద్ద మూడు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాపు కాయాలన్నారు. ఇదిలా ఉండగా.. సుబ్బరాయుడు భార్య శైలజ గతంలో ఎంపీపీగా చేశారు. ప్రస్తుత సమావేశంలోనూ ఆమెనే ప్రస్తుత ఎన్నికల్లో జెడ్పీటీసీ మండల అభ్యర్థిగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement