‘నామినేషన్లు వెనక్కి తీసుకోండి.. లేదంటే చంపేస్తాం’.. అంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫోన్ చేసి హుకుం జారీచేస్తున్నారు. మూడు రోజులుగా దాడులు, దౌర్జన్యాలు చేసినా భయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘చివరిగా.. హచ్చరికలు జారీ చేసి.. నామినేషన్లు వెనక్కు తీసుకునే విధంగా బరితెగిస్తున్నారు. ఇదేమారిదిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా ఇప్పటి నుంచే బెదిరింపులకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి,తిరుపతి: ఎన్నికల్లో గెలిచే సత్తాలేక టీడీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెచ్చిపోతోంది. మందీమార్బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో మూడు రోజుల నుంచి దాడులు.. దౌర్జన్యాలు అధికం చేసింది. ఇది చాలదన్నట్టు రేపటి నుంచి జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు నామినేషన్లు వేసే ప్రతి ఒక్కరికీ పూర్తి భద్రత కలి్పంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తిరుపతిలో పరాకాష్టకు చేరిన బెదిరింపులు
మూడు రోజులుగా దాడులు, దౌర్జన్యాలు చేసినా వెనక్కి తగ్గని వైఎస్సార్‌సీపీ నేతలు కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రాణాలు పణంగా పెట్టి ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా వారి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేవిధంగా కుయుక్తులు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతి 36వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ ఇమాంకు టీడీపీ గూండాలు ఫోన్‌చేసి బెదిరించినట్లు ఆయన తన సెల్ఫీ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ ఫోన్‌చేసి బెదిరించినట్లు ఆయన వెల్లడించారు. ఇదేవిధంగా నగరంలోని అనేక మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి భయాందోళనకు గురిచేస్తున్నట్టు సమాచారం.
వాకాడులో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు
తిరుపతి జిల్లా పరిధిలోని వాకాడు మండలం, నెల్లిపూడి ఎంపీటీసీ అభ్యరి్థగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు పాపారెడ్డి రాజశేఖరరెడ్డి, అదే మండలానికి చెందిన కొండాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్న ఏనుగు పుష్పపై అక్రమ కేసులు నమోదు చేయించినట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వీల్లేదని హెచ్చరించినట్లు చెబుతున్నారు. నామినేషన్ వేయడానికి సిద్ధమైన తమపై టీడీపీ నేతలు అక్రమ కేసులు నమోదు చేయించారని వెల్లడించారు. పోలీస్టేషన్ నుంచి ఫోన్‌చేసి ‘నువ్వు వాస్తావా? మమ్మల్ని రమ్మంటావా? అంటూ పోలీసుల చేత బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తిలో బెదిరింపుల పర్వం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీని ఎన్నికల్లో ఎదుర్కోవడానికి కష్టమని టీడీపీ నేతలకు అర్థమైనట్టుంది. అందుకే టీడీపీ నాయకులు ‘బెదిరించు.. భయపెట్టు.. అనర్హత వేటు వెయ్’ అనే మూడు పాలసీలతో ఎన్నికల బరిలో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ వారు మొదట ఎవరినైతే ఎన్నికల బరిలో దింపుతారో ఆ అభ్యరి్థని బెదిరించి, వారి బంధువుల ద్వారా చెప్పి చూస్తారు. దానికి లొంగకపోతే ఎన్నికల కేంద్రం వద్ద భయభ్రాంతులకు గురిచేసి వారి దగ్గర నుంచి నామినేషన్ ఫారాలు లాక్కోవడానికి సిద్ధమవుతారు.
ఈ మేరకు అన్ని కేంద్రాల వద్ద తమ మనుషులను సిద్ధం చేసుకుంటున్నారు. దాన్ని తప్పించుకుని లోపలికి వెళ్లిన వారికి ఏదో ఒక సరి్టఫికెట్ లేదని చెప్పి వారిపై అనర్హత వేటు వేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మద్యం టెండర్లకు ఎవరినీ నామినేషన్లు వేయకుండా చేసి షాపులు దక్కించుకున్నట్టు ఎన్నికల్లో కూడా అదే పాలసీతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవసరమైతే దాడులు చేయండి.. పోలీసులందరూ కూడా మనకు సహకరిస్తారు అని ఆ పార్టీ నేతలు నూరిపోస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్ వేసే ప్రక్రియను జరగనిస్తారో.. లేక వారు కూడా చేతులెత్తేసి టీడీపీ నాయకులకు సహకరిస్తారో వేచి చూడాల్సిందే.
ఇదీ చతవండి: ఎంపీపీ కుర్చీకి రూ.2 కోట్ల బేరమంట!


